Telugu Global
International

అమెజాన్ కు ఏమైంది? ఓ వైపు సీఈవో ప్రేమాయణం... మరోవైపు డేటాలీక్!

అమెజాన్…అమెరికాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం. ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. ఇప్పుడు పలు వివాదాలతో వార్తల్లో నిలిచింది. టీవీ యాంకర్ తో ప్రేమలో పడిన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ భార్యకు విడాకులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మరోవైపు అమెజాన్ లో విక్రయదారుల డేటాలీక్ తో అమెజాన్ వార్తల్లో హాట్ టాపిగ్గా మారింది. ఇంటర్నల్ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా అమెజాన్ ఇండియా పోర్టల్లో విక్రయదారుల డేటా లీక్ అయ్యింది. ముఖ్యంగా సెల్లర్స్‌ వ్యక్తిగత […]

అమెజాన్ కు ఏమైంది? ఓ వైపు సీఈవో ప్రేమాయణం... మరోవైపు డేటాలీక్!
X

అమెజాన్…అమెరికాకు చెందిన ఈ కామర్స్ దిగ్గజం. ప్రపంచంలోనే అత్యంత విలువైన సంస్థగా అవతరించింది. ఇప్పుడు పలు వివాదాలతో వార్తల్లో నిలిచింది.

టీవీ యాంకర్ తో ప్రేమలో పడిన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ భార్యకు విడాకులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మరోవైపు అమెజాన్ లో విక్రయదారుల డేటాలీక్ తో అమెజాన్ వార్తల్లో హాట్ టాపిగ్గా మారింది. ఇంటర్నల్ వ్యవస్థలో సాంకేతిక లోపం కారణంగా అమెజాన్ ఇండియా పోర్టల్లో విక్రయదారుల డేటా లీక్ అయ్యింది.

అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ భార్యతో

ముఖ్యంగా సెల్లర్స్‌ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాల సమాచారం చోరీకి గురైంది. వీరి అమ్మకాలకు సంబంధించిన నెలవారీ ఆర్థిక లావాదేవీల వివరాలు, ఇతరాలు అక్రమంగా బహిర్గతం కావడం కలకలం రేపింది.

వరుసగా డేటాలీక్స్‌ అవుతుండటంతో సోషల్‌ మీడియా యూజర్లను ఆందోళనలోకి నెట్టివేస్తున్నాయి. ఫేస్‌బుక్‌ ఖాతాల డేటాబ్రీచ్‌ ప్రకంపనలు ఇంకా చల్లారకముందే తాజాగా అమెజాన్‌ ఇండియాలో మరో డేటా బ్రీచ్‌ కలకలం రేపింది.

అమెజాన్‌లో నమోదైన సెల్లర్స్‌ ఆర్థిక లావాదేవీల వివరాలు అక్రమంగా ప్రత్యర్థి విక్రయాదారులతోపాటు, ఇతరులకు కూడా అందాయి. దీన్ని అమెజాన్‌ ఇండియా ధృవీకరించింది. విక్రయదారులు డౌన్‌లోడింగ్‌ సందర్భంగా సమస‍్యలు తలెత్తడంతో డేటా బ్రీచ్‌ అంశాన్ని గమనించామని వెల్లడించింది.

టీవీ యాంకర్ తో జెఫ్ బెజోస్

అయితే సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి వెంటనే చర్యలు చేపట్టామని ప్రకటించింది. అయితే ఈ ప్రభావానికి గురైన అమ్మకందారుల సంఖ్యను మాత్రం బహిర్గతం చేయలేదు.

ఇక అమెజాన్‌లో దాదాపు 150 మిలియన్ల రిజిస్టర్డ్‌ యూజర్లు ఉన్నారు. వారిలో సుమారు 40 లక్షల మంది విక్రయదారులుగా నమోదయ్యారు. ఈ నేపథ‍్యంలో తాజా డాటా లీక్‌ ప్రభావానికి ఎంతమంది గురయ్యారు? ఎంతమంది సెల్లర్స్‌ ఫిర్యాదు చేశారనే దానిపై ఇంకా స్పష్టత లేదు. గత ఏడాది కూడా అమెజాన్‌లో దాదాపు ఇలాంటి సమస్యే తలెత్తింది.

First Published:  10 Jan 2019 5:12 AM GMT
Next Story