Telugu Global
NEWS

క్రికెట్ స్టేడియాలకే బాహుబలి.... అహ్మదాబాద్ స్టేడియం

అహ్మదాబాద్ లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం మెల్బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని మించనున్న గుజరాత్ క్రికెట్ స్టేడియం లక్షా 10 వేల సీటింగ్ సామర్థ్యంతో పరిమళ్ నాథ్వానీ గుజరాత్ క్రికెట్ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏదంటే….ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం అన్న సమాధానమే వస్తుంది. అయితే…లక్షా 24 సీటింగ్ సామర్థ్యం ఉన్న మెల్బోర్న్ స్టేడియాన్ని తలదన్నేలా… ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిర్మిస్తున్నారు.   అరుదైన రికార్డుల అడ్డా… […]

క్రికెట్ స్టేడియాలకే బాహుబలి.... అహ్మదాబాద్ స్టేడియం
X
  • అహ్మదాబాద్ లో ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నిర్మాణం
  • మెల్బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని మించనున్న గుజరాత్ క్రికెట్ స్టేడియం
  • లక్షా 10 వేల సీటింగ్ సామర్థ్యంతో పరిమళ్ నాథ్వానీ గుజరాత్ క్రికెట్ స్టేడియం

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఏదంటే….ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం అన్న సమాధానమే వస్తుంది.

అయితే…లక్షా 24 సీటింగ్ సామర్థ్యం ఉన్న మెల్బోర్న్ స్టేడియాన్ని తలదన్నేలా… ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిర్మిస్తున్నారు.

అరుదైన రికార్డుల అడ్డా…

మోతేరా స్టేడియంగా, సర్దార్ పటేల్ స్టేడియంగా సుపరిచితమైన అహ్మదాబాద్ స్టేడియంలోనే…సునీల్ గవాస్కర్ 10 వేల పరుగుల మైలురాయిని చేరితే…మాస్టర్ సచిన్ టెండుల్కర్ తన కెరియర్ లో తొలిడబుల్ సెంచరీని సైతం నమోదు చేశాడు.

సర్ రిచర్డ్ హాడ్లీ పేరుతో ఉన్న 431 టెస్ట్ వికెట్ల ప్రపంచ రికార్డును కపిల్ దేవ్ గుజరాత్ సర్దార్ పటేల్ స్టేడియంలోనే అధిగమించాడు.

అలాంటి స్టేడియాన్ని పడగొట్టి…సరికొత్త స్టేడియం నిర్మాణం మొదలు పెట్టారు. 50 వేల సీటింగ్ సామర్థ్యాన్ని లక్షా పదివేలకు పెంచడానికి ఏర్పాట్లు చేశారు.

లక్షా 10వేల సీటింగ్ కెపాసిటీ

గుజరాత్ క్రికెట్ సంఘం తాజాగా నిర్మిస్తున్న ఈ స్టేడియంలో లక్షా 10వేల మంది కూర్చొని మ్యాచ్ చూసే వీలుంది. ఇప్పటి వరకూ భారత్ అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా ఉన్న కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ కెపాసిటీ 66వేలు మాత్రమే.

అహ్మదాబాద్ లో నిర్మిస్తున్న ఈ స్టేడియాన్ని పరిమళ్ నాథ్వానీ గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంగా పిలవనున్నారు.

First Published:  9 Jan 2019 6:46 AM GMT
Next Story