Telugu Global
NEWS

హెరిటేజ్‌.... ఈ ‘చెత్త’ పనులేమిటి?

హైదరాబాద్‌కు చెందిన ఒక స్వచ్చంద సంస్థ చంద్రబాబు కుటుంబానికి చెందిన “హెరిటేజ్‌” పై పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసింది. కారణం ఏమిటంటే హెరిటేజ్‌ సూపర్‌ మార్కెట్‌లో పాడయిపోయిన, కుళ్ళిపోయిన, ఎక్స్‌పైర్‌ డేట్‌ అయిపోయిన సరుకులు, నూనెలు, కూల్‌ డ్రింకులు, ఇంకా అనేక రకరకాల పదార్ధాలను లారీలో తీసుకువచ్చి గండిపేట మండలం నెక్నాం పూర్ గ్రామంలోని చెరువుల్లో పారాబోసి పోవడం పై ఈ ఫిర్యాదు చేశారు. నెక్నాం పూర్‌ గ్రామంలో 55 ఎకరాల విస్తీర్ణంలో […]

హెరిటేజ్‌.... ఈ ‘చెత్త’ పనులేమిటి?
X

హైదరాబాద్‌కు చెందిన ఒక స్వచ్చంద సంస్థ చంద్రబాబు కుటుంబానికి చెందిన “హెరిటేజ్‌” పై పర్యావరణ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేసింది.

కారణం ఏమిటంటే హెరిటేజ్‌ సూపర్‌ మార్కెట్‌లో పాడయిపోయిన, కుళ్ళిపోయిన, ఎక్స్‌పైర్‌ డేట్‌ అయిపోయిన సరుకులు, నూనెలు, కూల్‌ డ్రింకులు, ఇంకా అనేక రకరకాల పదార్ధాలను లారీలో తీసుకువచ్చి గండిపేట మండలం నెక్నాం పూర్ గ్రామంలోని చెరువుల్లో పారాబోసి పోవడం పై ఈ ఫిర్యాదు చేశారు.

నెక్నాం పూర్‌ గ్రామంలో 55 ఎకరాల విస్తీర్ణంలో రెండు చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల్లో కలుషిత జలాలు చేరి ప్రజలు ఇబ్బందిపడుతూ ఉండడంతో ఒక స్వచ్ఛంద సంస్థ ఆ చెరువులను దత్తతకు తీసుకొని, ఆ చెరువుల పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళింది. ప్రభుత్వం స్పందించి ఆ రెండు చెరువులను బాగు చేయడానికి నిధులు కేటాయించింది. కొంత కాలం నుంచి ఆ చెరువులను శుభ్రం చేసే పనులు కొనసాగుతున్నాయి.

ఒకవైపు చెరువులు శుభ్రం చేస్తుంటే మరోవైపు హెరిటేజ్‌ సూపర్‌ మార్కెట్‌ వాళ్ళు వాళ్ళ దగ్గర చెత్తను లారీలో తీసుకువచ్చి ఆ చెరువులో పోయడం పై స్థానికులు మండిపడుతున్నారు.

First Published:  9 Jan 2019 2:00 AM GMT
Next Story