Telugu Global
NEWS

వైరల్‌గా మారిన కోహ్లి సేన విక్టరీ డ్యాన్స్ క్లిప్‌

ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఓడించి ‘బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోపి’ని ఇండియా తీసుకురావాలన్నది 72 ఏళ్ల కల. టీమిండియా 11 సార్లు దండెత్తినా ట్రోఫిని తాకలేకపోయింది. కానీ దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ భారతీయులు గర్వించే విజయాన్ని కొహ్లీ సేన సాకారం చేసింది. 2-1 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి సీరిస్‌ను సొంతం చేసుకుంది. ఇంతటి అమూల్యమైన విజయాన్ని అందుకున్న టీమిండియా సభ్యులు అంతే స్థాయిలో పులకించారు. ఇప్పుడు ఆ తాలుకు వీడియాలో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. గెలిచిన తర్వాత   క్లోహి, […]

వైరల్‌గా మారిన కోహ్లి సేన విక్టరీ డ్యాన్స్ క్లిప్‌
X

ఆస్ట్రేలియాను సొంతగడ్డపై ఓడించి ‘బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోపి’ని ఇండియా తీసుకురావాలన్నది 72 ఏళ్ల కల. టీమిండియా 11 సార్లు దండెత్తినా ట్రోఫిని తాకలేకపోయింది.

కానీ దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ భారతీయులు గర్వించే విజయాన్ని కొహ్లీ సేన సాకారం చేసింది. 2-1 తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి సీరిస్‌ను సొంతం చేసుకుంది.

ఇంతటి అమూల్యమైన విజయాన్ని అందుకున్న టీమిండియా సభ్యులు అంతే స్థాయిలో పులకించారు. ఇప్పుడు ఆ తాలుకు వీడియాలో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. గెలిచిన తర్వాత క్లోహి, ఇతర ఆటగాళ్లు డ్యాన్స్‌ చేశారు.

ఒకవైపు డ్యాన్స్‌ చేస్తూనే కోహ్లి ఈ దృశ్యాలను తన మొబైల్‌లో చిత్రీకరించారు. ఆటగాళ్లతో రవిశాస్త్రి కూడా జత కలిశారు.

లింక్:

https://www.thenews.com.pk/latest/416240-viral-indian-team-celebrates-historic-win-against-australia-in-style

First Published:  8 Jan 2019 11:16 PM GMT
Next Story