Telugu Global
International

ఎయిర్‌పోర్టులో చిన్నారిని ఈడ్చుకెళ్లిన తండ్రి....

పిల్లలు ఒక్కోసారి మారాం చేయడం మొదలుపెట్టారంటే ఎప్పుడు ఆపుతారో తెలియదు. వారికి నచ్చని పనులు చేయాల్సి వచ్చినా… బోరు కొట్టే పరిస్థితి ఉన్నా పిల్లలు చికాకు పడుతుంటారు. ఆ సమయంలో పిల్లలు చేసే మారాం… తల్లిదండ్రులకు పిచ్చకోపాన్ని తెప్పిస్తుంటుంది. ఇలాంటి పరిస్థితి ఓ తండ్రికి డల్లాస్‌ ఎయిర్‌పోర్టులో ఎదురైంది. ఎయిర్‌పోర్టులో చిన్నారి చేస్తున్న మారాంతో సదరు వ్యక్తి ఒకింత ఫ్రస్టేషన్‌కు గురయ్యాడు. దాంతో చిన్నారిని ఎయిర్‌పోర్టులో ఈడ్చుకుంటూ వెళ్లాడు. అక్కడే ఉన్న కొందరు దీన్ని మొబైల్స్‌లో రికార్డు […]

ఎయిర్‌పోర్టులో చిన్నారిని ఈడ్చుకెళ్లిన తండ్రి....
X

పిల్లలు ఒక్కోసారి మారాం చేయడం మొదలుపెట్టారంటే ఎప్పుడు ఆపుతారో తెలియదు. వారికి నచ్చని పనులు చేయాల్సి వచ్చినా… బోరు కొట్టే పరిస్థితి ఉన్నా పిల్లలు చికాకు పడుతుంటారు. ఆ సమయంలో పిల్లలు చేసే మారాం… తల్లిదండ్రులకు పిచ్చకోపాన్ని తెప్పిస్తుంటుంది.

ఇలాంటి పరిస్థితి ఓ తండ్రికి డల్లాస్‌ ఎయిర్‌పోర్టులో ఎదురైంది. ఎయిర్‌పోర్టులో చిన్నారి చేస్తున్న మారాంతో సదరు వ్యక్తి ఒకింత ఫ్రస్టేషన్‌కు గురయ్యాడు. దాంతో చిన్నారిని ఎయిర్‌పోర్టులో ఈడ్చుకుంటూ వెళ్లాడు. అక్కడే ఉన్న కొందరు దీన్ని మొబైల్స్‌లో రికార్డు చేశారు.

కూతురు వేసుకున్న డ్రస్‌ కొనను పట్టుకుని సదరు వ్యక్తి లాగుతూ తీసుకెళ్లాడు. ఆ సమయంలో ఆ చిన్నారి కూడా ఏమాత్రం ప్రతిఘటించకుండా ఎంచక్కా జారుడు బండపై జారుతున్నట్టుగా తండ్రి వెంట వెళ్లింది. ఈ చిన్నారి అక్క కూడా వెనుకే తండ్రిని, చెల్లిని అనుసరించింది.

మ్యాటర్ ఎంత సీరియస్‌ అయినా… చూసేందుకు మాత్రం ఈ దృశ్యం ఆసక్తిగా ఉంది. ఈ వీడియో వైరల్‌గా మారింది. తండ్రిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ ఘటనను ఫ్రస్టేషన్‌లో తండ్రిబిడ్డ మధ్య రిలేషన్ ఇలా ఉంటుందని చెబుతుండగా… మరికొందరు మాత్రం అతడి చర్యను తీవ్రంగా తప్పుపడుతున్నారు.

First Published:  8 Jan 2019 11:40 PM GMT
Next Story