Telugu Global
Sankranthi Food

సంక్రాంతి వంటకాలు…. సున్నుండ‌లు

కావ‌ల్సిన వ‌స్తువులు: మిన‌ప్ప‌ప్పు – పావు కేజీ పెస‌ర ప‌ప్పు – పావు కేజీ బెల్లం – 400 గ్రాములు ఏల‌కుల పొడి – ఒక టీ స్పూన్‌ నెయ్యి – 200 గ్రాములు త‌యారీ: బాణ‌లిలో నూనె లేకుండా మిన‌ప్ప‌ప్పు, పెస‌ర‌ప‌ప్పుల‌ను దోర‌గా వేయించాలి (ఏ ప‌ప్పుకు ఆ ప‌ప్పు విడిగా వేయించాలి). ప‌ప్పులు చ‌ల్లారిన త‌ర్వాత క‌లిపి పొడి చేయాలి. బెల్లాన్ని పొడి చేసి అందులో ఏల‌కుల‌పొడి క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని మిన‌ప్ప -పెస‌ర‌పిండి […]

సంక్రాంతి వంటకాలు…. సున్నుండ‌లు
X

కావ‌ల్సిన వ‌స్తువులు:

  • మిన‌ప్ప‌ప్పు – పావు కేజీ
  • పెస‌ర ప‌ప్పు – పావు కేజీ
  • బెల్లం – 400 గ్రాములు
  • ఏల‌కుల పొడి – ఒక టీ స్పూన్‌
  • నెయ్యి – 200 గ్రాములు

త‌యారీ:

బాణ‌లిలో నూనె లేకుండా మిన‌ప్ప‌ప్పు, పెస‌ర‌ప‌ప్పుల‌ను దోర‌గా వేయించాలి (ఏ ప‌ప్పుకు ఆ ప‌ప్పు విడిగా వేయించాలి). ప‌ప్పులు చ‌ల్లారిన త‌ర్వాత క‌లిపి పొడి చేయాలి.

బెల్లాన్ని పొడి చేసి అందులో ఏల‌కుల‌పొడి క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని మిన‌ప్ప -పెస‌ర‌పిండి మిశ్ర‌మంలో క‌ల‌పాలి. అన్నీ స‌మంగా క‌లిసే వ‌ర‌కు క‌ల‌పాలి. చివ‌ర‌గా నెయ్యి వేసి క‌ల‌పాలి. ఇప్పుడు మ‌న‌కు కావ‌ల్సిన సైజు ఉండ‌లు చేసుకోవాలి.

నెయ్యి వాడ‌కాన్ని త‌గ్గించాల‌నుకునే వాళ్లు… పిండిలో నెయ్యి వేయకూడ‌దు. పిండి మిశ్ర‌మాన్ని ఉండ‌లు క‌ట్టేట‌ప్పుడు కొద్దిగా నెయ్యి చేతికి రాసుకుంటూ ఉండాలి.

First Published:  7 Jan 2019 11:57 PM GMT
Next Story