Telugu Global
Cinema & Entertainment

వెండితెరపైకి మరో నిర్మాత కొడుకు

ఇప్పటికే ఇండస్ట్రీలో బడా నిర్మాతల కొడుకులు కొంతమంది ఉన్నారు. నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్, అల్లు అర్జున్ లాంటి కొంతమంది హీరోలు ఈ కోవలోకి వస్తారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో నిర్మాత కొడుకు కూడా చేరాడు. నిర్మాత రాజ్ కందుకూరి కొడుకు శివ కందుకూరి హీరోగా పరిచయం అవుతున్నాడు. అతడి సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది. కొడుకు తెరంగేట్రం కోసం రాజ్ కందుకూరి చాలా ప్రయత్నాలు చేశారు. ముందుగా కొడుకుని అమెరికా పంపించారు. తర్వాత టాలీవుడ్ లో […]

వెండితెరపైకి మరో నిర్మాత కొడుకు
X

ఇప్పటికే ఇండస్ట్రీలో బడా నిర్మాతల కొడుకులు కొంతమంది ఉన్నారు. నితిన్, బెల్లంకొండ శ్రీనివాస్, అల్లు అర్జున్ లాంటి కొంతమంది హీరోలు ఈ కోవలోకి వస్తారు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో నిర్మాత కొడుకు కూడా చేరాడు. నిర్మాత రాజ్ కందుకూరి కొడుకు శివ కందుకూరి హీరోగా పరిచయం అవుతున్నాడు. అతడి సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది.

కొడుకు తెరంగేట్రం కోసం రాజ్ కందుకూరి చాలా ప్రయత్నాలు చేశారు. ముందుగా కొడుకుని అమెరికా పంపించారు. తర్వాత టాలీవుడ్ లో బాగానే పావులు కదిపారు. తన బ్యాకప్ ఇస్తూ ఓ మంచి బ్యానర్, ఓ బడా డైరక్టర్ ను సెట్ చేద్దాం అనుకున్నారు. కానీ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తన టేస్ట్ కు తగ్గట్టు ఓ మంచి కథను ఎంపిక చేసి కొడుకును అమెరికా నుంచి రప్పించి హీరోగా మార్చేశారు. తనే నిర్మాతగా కొత్త సినిమా స్టార్ట్ చేశారు.

ధర్మపథ క్రియేషన్స్ బ్యానర్ పై ఈరోజు ప్రారంభమైన ఈ సినిమాతో సింధురావు అనే దర్శకురాలు ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. గతంలో క్రిష్, సుకుమార్ వద్ద అసిస్టెంట్ డైరక్టర్ గా ఈమె పనిచేసింది.

ఇక 96 సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించిన వర్షను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. గోపీసుందర్ ను మ్యూజిక్ డైరక్టర్ గా పెట్టుకున్నారు. ఇలా తనకు అనుకూలమైన సెటప్ తో రాజ్ కందుకూరి తన కొడుకు శివను తెరపైకి తీసుకొస్తున్నాడు. ఈ ప్రయత్నానికి నిర్మాత దగ్గుబాటి సురేష్ తనవంతు సహాయం అందిస్తున్నాడు.

First Published:  8 Jan 2019 5:00 AM GMT
Next Story