Telugu Global
Cinema & Entertainment

కత్రినాకైఫ్ టాలీవుడ్ రీఎంట్రీ.... నిజమెంత?

ఒక్కసారిగా టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పైకి కత్రినాకైఫ్ పేరు దూసుకొచ్చింది. ఆమె తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతోందంటూ పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. గడిచిన 3 రోజులుగా ఫిలింనగర్ లో ఇదే చర్చ. మహేష్-సుకుమార్ సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకోబోతున్నారంటూ ప్రచారం. అయితే లాజికల్ గా ఆలోచిస్తే ఇది జరిగే పని కాదనే విషయం ఈజీగా అర్థమౌతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది కత్రినాకైఫ్. కేవలం స్టార్ హీరోలే లక్ష్యంగా ఆమె సినిమాలు చేస్తోంది. […]

కత్రినాకైఫ్ టాలీవుడ్ రీఎంట్రీ.... నిజమెంత?
X
ఒక్కసారిగా టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పైకి కత్రినాకైఫ్ పేరు దూసుకొచ్చింది. ఆమె తెలుగులో రీఎంట్రీ ఇవ్వబోతోందంటూ పుంఖానుపుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. గడిచిన 3 రోజులుగా ఫిలింనగర్ లో ఇదే చర్చ. మహేష్-సుకుమార్ సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకోబోతున్నారంటూ ప్రచారం. అయితే లాజికల్ గా ఆలోచిస్తే ఇది జరిగే పని కాదనే విషయం ఈజీగా అర్థమౌతుంది.
ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది కత్రినాకైఫ్. కేవలం స్టార్ హీరోలే లక్ష్యంగా ఆమె సినిమాలు చేస్తోంది. కొన్ని సందర్భాల్లో స్టార్ హీరోలు ప్రయత్నించినా ఆమె కాల్షీట్లు దొరకడం లేదు. అలాంటి హీరోయిన్ పనిగట్టుకొని మరీ తెలుగులోకి వచ్చి ఓ సినిమా చేస్తుందా..? కచ్చితంగా చేయదు.
పాయింట్ నంబర్-2… బాలీవుడ్ లో భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ కత్రిన. అటుఇటుగా ఆమె సినిమాకు 4 కోట్ల రూపాయలు ఛార్జ్ చేస్తుందట. అంత మొత్తం చెల్లించి ఆమెను టాలీవుడ్ కు తీసుకొస్తారా అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. పోనీ కత్రినాకైఫ్ ఏమైనా తన పారితోషికం తగ్గించుకుంటుందా అంటే, ఇదేమీ అంతర్జాతీయ ప్రాజెక్టు కాదు. కనీసం ఆమె చుట్టూ తిరిగే కథ కూడా కాదు.
ఈ రెండు కారణాలకు తోడు ఆమె ఇప్పుడు హాలీవుడ్ పై దృష్టిపెట్టింది. ఇంగ్లిష్ లో ఓ టీవీ సిరీస్ చేసే ఆలోచనలో ఉంది కత్రిన. మరోవైపు ఆమె పెళ్లిపై ఎప్పటికప్పుడు పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. సో.. ఇలాంటి టైమ్ లో కత్రినాకైఫ్ టాలీవుడ్ కు వచ్చి ఓ సినిమా చేస్తుందని ఆశించడం భ్రమే అవుతుంది.
First Published:  7 Jan 2019 8:50 PM GMT
Next Story