Telugu Global
NEWS

2011లో అలా... 2019లో ఇలా...!

ఇది భావోద్వేగాల విజయం- విరాట్ కొహ్లీ 2011 వన్డే ప్రపంచకప్ విజేత టీమిండియా సభ్యుడిగా కొహ్లీ 2018-19 ఆసీస్ సిరీస్ విజేత టీమిండియా కెప్టెన్ గా కొహ్లీ ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై ఓడించి టెస్ట్ సిరీస్ నెగ్గడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ …పట్టలేని ఆనందంతో మురిసిపోతున్నాడు. క్రికెటర్ గా…టీమిండియా కెప్టెన్ గా తన కెరియర్ లో సాధించిన అద్భుత విజయం ఇదేనని…సిడ్నీ టెస్ట్ డ్రాగా ముగిసిన అనంతరం ప్రకటించాడు. కంగారు గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గడానికి భారతజట్టు […]

2011లో అలా... 2019లో ఇలా...!
X
  • ఇది భావోద్వేగాల విజయం- విరాట్ కొహ్లీ
  • 2011 వన్డే ప్రపంచకప్ విజేత టీమిండియా సభ్యుడిగా కొహ్లీ
  • 2018-19 ఆసీస్ సిరీస్ విజేత టీమిండియా కెప్టెన్ గా కొహ్లీ

ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపై ఓడించి టెస్ట్ సిరీస్ నెగ్గడంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ …పట్టలేని ఆనందంతో మురిసిపోతున్నాడు. క్రికెటర్ గా…టీమిండియా కెప్టెన్ గా తన కెరియర్ లో సాధించిన అద్భుత విజయం ఇదేనని…సిడ్నీ టెస్ట్ డ్రాగా ముగిసిన అనంతరం ప్రకటించాడు.

కంగారు గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గడానికి భారతజట్టు 1947-48 సీజన్ నుంచి…ఇప్పటి వరకూ ఆడిన 11 సిరీస్ ల ద్వారా చేసిన ప్రయత్నం…తన కెప్టెన్సీలో సఫలం కావడం…తనకు, తనజట్టు సభ్యులకు గర్వకారణమని కొహ్లీ చెప్పాడు.

అయితే…2011 ప్రపంచకప్ సాధించిన సమయంలోని భావోద్వేగాల కంటే…ప్రస్తుత సిరీస్ విజయమే తనను కదిపి కుదిపేసిందని కొహ్లీ గుర్తు చేసుకొన్నాడు.

స్వదేశీ గడ్డపై ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ప్రపంచకప్ లో విజేతగా నిలిచిన భారతజట్టులో సభ్యుడిగా ఉన్న తనకు…అప్పట్లో అంతగా భావోద్వేగాలు లేవని… సచిన్, యువరాజ్, గంభీర్ లాంటి అప్పటి సీనియర్లు మాత్రమే ఆ విజయాన్ని భావోద్వేగాల విజయంగా చూశారని కొహ్లీ తెలిపాడు.

భావోద్వేగాల సమరం….

తనకు సంబంధించినంత వరకూ ఆస్ట్రేలియా గడ్డపై సాధించిన ప్రస్తుత ఈ సిరీస్ విజయమే..భావోద్వేగాలతో కదిపికుదిపేసిందని గుర్తు చేసుకొన్నాడు. గత ఏడాది కాలంగా తాము పడిన శ్రమ, నిలకడగా ఆడిన ఆటకు తగిన ఫలితం ఇదేనని చెప్పాడు.

విజయం ఏదైనా మధురమేనని…అయితే ఈ గెలుపు మాత్రం ఆపారమధురమేనంటూ టీమిండియా కెప్టెన్ మురిసిపోతున్నాడు. ఇది ఏ ఒక్కరి కారణంగానో వచ్చిన గెలుపు కాదని…జట్టులోని ప్రతిఒక్క సభ్యుడి కష్టానికి ఫలితమని కొహ్లీ వివరించాడు.

తన వరకూ చూస్తే…మెల్బోర్న్ టెస్టులో…టీమిండియా స్టాప్ గ్యాప్ ఓపెనర్ గా హనుమ విహారీ 70 బంతులు ఎదుర్కొనడం…సెంచరీ సాధించడంతో సమానమని తెలిపాడు.

1983 ప్రపంచకప్ తో సమానం….

మరోవైపు…టీమిండియా చీఫ్ కోచ్ రవి శాస్త్రి మాత్రం…1983 ప్రపంచకప్ లో భారత్ సాధించిన విజయంతో…ప్రస్తుత ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ విజయం తనకు సమానమని చెప్పాడు.

వన్డే ఫార్మాట్ తో.. టెస్ట్ ఫార్మాట్ ను పోల్చడం తగదని…అయితే…కపిల్ కెప్టెన్సీలో ప్రపంచకప్ తొలిసారిగా సాధించిన సమయంలో ఎంత ఆనందం లభించిందో…కొహ్లీ కెప్టెన్సీలో కంగారూ గడ్డపై ప్రస్తుతం సాధించిన టెస్ట్ సిరీస్ విజయంతో అంతే సంతృప్తి దక్కిందని తెలిపాడు.

కొహ్లీకి రవి శాస్త్రి హ్యాట్సాఫ్….

టెస్ట్ క్రికెట్ అంటే ఎంతో ఇష్టంతో, అభిమానంతో ఆడే విరాట్ కొహ్లీ లాంటి కెప్టెన్ ను తాను ఇప్పటి వరకూ చూడలేదంటూ రవిశాస్త్రి మురిసిపోయాడు.

2018 సౌతాఫ్రికా పర్యటనతోనే తమ విదేశీ సిరీస్ ల వేట ప్రారంభమయ్యిందని..సౌతాఫ్రికా, ఇంగ్లండ్ తో ముగిసిన సిరీస్ ల్లో చేసిన పొరపాట్ల నుంచి తగిన పాఠాలు నేర్చుకొన్నామని…ఆసీస్ సిరీస్ లో తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకొన్నామని రవి శాస్త్రి గుర్తు చేశాడు.

కుర్రాళ్లకు కితాబు…

గత ఏడాది కాలంలో రిషభ్ పంత్, మయాంక్ అగర్వాల్. పృథ్వీ షా, జస్ ప్రీత్ బుమ్రా, హనుమ విహారీ, కుల్దీప్ యాదవ్ లాంటి యువఆటగాళ్లు…తమకు లభించిన అవకాశాలను చక్కగా సద్వినియోగం చేసుకొని…. టెస్ట్ క్రికెట్లో తమ సత్తా చాటుకొన్నారని తెలిపాడు.

భారత క్రికెట్లో ప్రస్తుతం ఆరోగ్యవంతమైన పోటీ ఉందని చెప్పాడు. టీమిండియా చీఫ్ కోచ్ గా తాను జట్టుకు అందించిన అపురూప విజయం ఇదేనంటూ పొంగిపోయాడు.

First Published:  7 Jan 2019 10:06 PM GMT
Next Story