Telugu Global
NEWS

వైసీపీకి కృష్ణ సోదరుడు గుడ్‌బై?

వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. సూపర్ స్టార్‌ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న ఏకపక్షధోరణి వల్లే ఆయన పార్టీ వీడుతున్నట్టు చెబుతున్నారు. తొలి నుంచి వైసీపీకి అండగా ఉంటున్న ఆదిశేషగిరి రావు వచ్చే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేయాలని భావించారు. అయితే వైఎస్‌ జగన్‌ మాత్రం గుంటూరు సీటు ఇచ్చేందుకు నిరాకరించారు. విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా ఆయన్ను కోరారు. దీంతో నొచ్చుకున్న […]

వైసీపీకి కృష్ణ సోదరుడు గుడ్‌బై?
X

వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. సూపర్ స్టార్‌ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు వైసీపీని వీడేందుకు నిర్ణయించుకున్నారు. పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న ఏకపక్షధోరణి వల్లే ఆయన పార్టీ వీడుతున్నట్టు చెబుతున్నారు.

తొలి నుంచి వైసీపీకి అండగా ఉంటున్న ఆదిశేషగిరి రావు వచ్చే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేయాలని భావించారు. అయితే వైఎస్‌ జగన్‌ మాత్రం గుంటూరు సీటు ఇచ్చేందుకు నిరాకరించారు. విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా ఆయన్ను కోరారు.

దీంతో నొచ్చుకున్న ఆదిశేషగిరిరావు వైసీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకటి రెండు రోజుల్లోనే ఆదిశేషగిరిరావు రాజీనామా చేస్తారని సమాచారం.

First Published:  7 Jan 2019 9:11 PM GMT
Next Story