Telugu Global
National

కొట్టేసిన చట్టాన్ని ఉపయోగించి అరెస్టులు.... సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అసంబద్దంగా ఉన్న ఒక చట్టాన్ని గతంలోనే కొట్టేసినా.. అదే చట్టం కింద పలువురిని అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాంటి అరెస్టులను నిరోధించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని… ఆ ఆరెస్టులకు ఆదేశాలు జారీ చేసిన అధికారులను జైలుకు పంపుతామని సుప్రీంకోర్టు ఇవాళ హెచ్చరించింది. ఇన్ఫర్మేషన్ యాక్ట్‌లోని 66(a) సెక్షన్ అనేది రాజ్యాంగానికి విరుద్దంగా ఉందంటూ సుప్రీంకోర్టు 2015లో కొట్టేసింది. అయితే ఆ తర్వాత కూడా 22 మందిని అదే సెక్షన్ ఉపయోగించి విచారించారని […]

కొట్టేసిన చట్టాన్ని ఉపయోగించి అరెస్టులు.... సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం
X

రాజ్యాంగానికి వ్యతిరేకంగా, అసంబద్దంగా ఉన్న ఒక చట్టాన్ని గతంలోనే కొట్టేసినా.. అదే చట్టం కింద పలువురిని అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాంటి అరెస్టులను నిరోధించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని… ఆ ఆరెస్టులకు ఆదేశాలు జారీ చేసిన అధికారులను జైలుకు పంపుతామని సుప్రీంకోర్టు ఇవాళ హెచ్చరించింది.

ఇన్ఫర్మేషన్ యాక్ట్‌లోని 66(a) సెక్షన్ అనేది రాజ్యాంగానికి విరుద్దంగా ఉందంటూ సుప్రీంకోర్టు 2015లో కొట్టేసింది. అయితే ఆ తర్వాత కూడా 22 మందిని అదే సెక్షన్ ఉపయోగించి విచారించారని పీయూసీఎల్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ సమర్పించింది. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది.

జస్టీస్ రోహింగ్టన్ నారిమన్, వినీత్ శరణ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారిస్తూ… రద్దు చేసిన సెక్షన్ కింద అరెస్టులు చేసి విచారణ జరపడం వాస్తవమైతే అది నిజంగా షాక్‌కు గురి చేసే విషయమేనని వ్యాఖ్యానించారు. ఆ విచారణకు ఆదేశించిన అధికారులను జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఈ విషయంపై ప్రభుత్వం నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది.

పీయూసీఎల్ దాఖలు చేసిన పిటిషన్‌లో పలు విషయాలు పేర్కొంది. పలు పత్రికలు, మీడియా సంస్థల వార్తల నుంచి సేకరించిన సమాచారంతో పాటు.. జాతీయ క్రైం రికార్డ్స్ బ్యూరో నుంచి తీసుకున్న సమాచారాన్ని క్రోడీకరించడంతో పలు విషయాలు తెలిశాయని పేర్కొంది. రద్దు చేసిన 66(ఏ) సెక్షన్ ఇంకా న్యాయ వ్యవస్థలో కొనసాగుతోందని… పలువురిపై ఈ సెక్షన్ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపింది.

ఐటీ చట్టం 2000లో పార్లమెంటు ఆమోదించినా…. 66(ఏ) సెక్షన్ మాత్రం 2008లో ఒక అమెండ్మెంట్ ద్వారా చేర్చారు. అయితే ఇది రాజ్యాంగ విరుద్దమని.. పౌరుల స్వేచ్ఛను హరించివేస్తుందని పేర్కొంటూ శ్రేయా సింగాల్ అనే న్యాయ విద్యార్థిని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పౌరుల వాక్‌ స్వాతంత్రాన్ని ఇది నిరోదించడమే కాక.. పోలీసులు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని కేసు వేశారు. పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ఈ సెక్షన్ ను కొట్టేస్తూ 2015లో తీర్పు ఇచ్చింది. అయితే ఆ సెక్షన్‌ కింద ఇంకా అరెస్టులు జరుగుతూ ఉండడం విశేషం.

First Published:  7 Jan 2019 5:37 AM GMT
Next Story