స్టీఫెన్ సన్కు కేసీఆర్ బంపర్ ఆఫర్
స్టీఫెన్ సన్. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ఓటుకు నోటు కేసు సమయంలో స్టీఫెన్ సన్ ఒక సంచలనంగా మారారు. ఇప్పుడు స్టీఫెన్ సన్కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి బంపర్ ఆఫర్ ఇచ్చారు. రెండోసారి ఆయన్ను ఎమ్మెల్యేగా నామినేట్ చేస్తూ గవర్నర్కు ప్రతిపాదన పంపారు. గవర్నర్ ఆమోదముద్ర వేసిన వెంటనే నామినేటెడ్ ఎమ్మెల్యేగా స్టీఫెన్ సన్ నియామక గెజిట్ విడుదలవుతుంది. ఆంగ్లో ఇండియన్ ప్రాతినిధ్యం ఉండాలనే రాజ్యాంగ నిబంధన మేరకే ఈ […]
స్టీఫెన్ సన్. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ఓటుకు నోటు కేసు సమయంలో స్టీఫెన్ సన్ ఒక సంచలనంగా మారారు.
ఇప్పుడు స్టీఫెన్ సన్కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి బంపర్ ఆఫర్ ఇచ్చారు. రెండోసారి ఆయన్ను ఎమ్మెల్యేగా నామినేట్ చేస్తూ గవర్నర్కు ప్రతిపాదన పంపారు.
గవర్నర్ ఆమోదముద్ర వేసిన వెంటనే నామినేటెడ్ ఎమ్మెల్యేగా స్టీఫెన్ సన్ నియామక గెజిట్ విడుదలవుతుంది. ఆంగ్లో ఇండియన్ ప్రాతినిధ్యం ఉండాలనే రాజ్యాంగ నిబంధన మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేసీఆర్ వెల్లడించారు.
గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలు…. స్టీఫెన్ సన్ను కూడా సంప్రదించారు. అయితే ఈవిషయాన్ని ముందే ఏసీబీకి స్టీఫెన్ సన్ తెలియజేశారు.
మాటు వేసిన తెలంగాణ ఏసీబీ అధికారులు… రేవంత్ రెడ్డిని 50లక్షల నగదుతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. డబ్బుల కోసం అమ్ముడుపోకుండా నిజాయితీగా వ్యవహరించినందుకు…. స్టీఫెన్ సన్ను మరోసారి నామినేటెడ్ ఎమ్మెల్యే పదవి వరిస్తోంది.