Telugu Global
International

నేడు అమరావతికి టోని బ్లేయర్‌... ఎందుకంటే...

బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ నేడు అమరావతికి రాబోతున్నారు. టోనికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. టోని బ్లేయర్‌ రాక పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. అమరాతవతి వేదికగా పనిచేస్తున్న ఆర్టీజీఎస్‌ను పరిశీలించేందుకు టోని బ్లేయర్ వస్తున్నారు. ఆర్టీజీఎస్‌ను పరిశీలించేందుకు టోనీ బ్లేయర్ రావడం చాలా సంతోషంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అమరావతిలోని ఆర్టీజీఎస్‌ బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ (బ్లేయర్ బ్రిటన్ ప్రధానిగా ఉన్నప్పుడు […]

నేడు అమరావతికి టోని బ్లేయర్‌... ఎందుకంటే...
X

బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ నేడు అమరావతికి రాబోతున్నారు. టోనికి ఘనంగా స్వాగతం పలికేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. టోని బ్లేయర్‌ రాక పట్ల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.

అమరాతవతి వేదికగా పనిచేస్తున్న ఆర్టీజీఎస్‌ను పరిశీలించేందుకు టోని బ్లేయర్ వస్తున్నారు. ఆర్టీజీఎస్‌ను పరిశీలించేందుకు టోనీ బ్లేయర్ రావడం చాలా సంతోషంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

అమరావతిలోని ఆర్టీజీఎస్‌ బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ (బ్లేయర్ బ్రిటన్ ప్రధానిగా ఉన్నప్పుడు అమెరికా అధ్యకుడు జార్జ్ బుష్ జూనియర్ తో కలిసి అనేక దేశాలమీద యుద్ధం ప్రకటించారు. హిట్లర్ తర్వాత అంతటి యుద్ధ పిపాసులుగా వీరిద్దరూ పేరు పొందారు. ఈ దూకుడు యుద్ధాలకు సంబంధించి బ్రిటన్ లో ఈయన విచారణను కూడా ఎదుర్కొన్నారు.) దృష్టినే ఆకర్షించడం నిజంగా గొప్ప విషయమన్నారు.

అమరావతిలోని ఆర్టీజీఎస్ ప్రపంచానికే ఒక నమూనాగా మారిందని అధికారుల వద్ద చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. సమస్యల పరిష్కారం విషయంలో ఆర్టీజీఎస్‌ అంతర్జాతీయంగా ఒక గుర్తింపును తెచ్చుకుందన్నారు సీఎం. సకాలంలో సమస్యలను పరిష్కరించడంలోనే నిజమైన ప్రజాస్వామ్యం ఉందన్నారు.

అయితే ఇప్పుడు టోనీ బ్లేయర్ ఒక పౌరుడు మాత్రమే. ఏ పదవిలోనూ లేడు. ఆయన ఏ హోదాలో ఏపీకి వస్తున్నట్టు? ఏ పనిమీద వస్తున్నట్టు? ఎవరు ఆహ్వానిస్తున్నట్టు? ఆర్టీజీఎస్ గురించి ఇక్కడకు వచ్చి తెలుసుకోవాలని ఎందుకు అనుకున్నట్టు? తెలుసుకుని ప్రయోజనం ఏమిటి? – ఈ ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానం లేదు.

First Published:  7 Jan 2019 12:54 AM GMT
Next Story