Telugu Global
NEWS

మంత్రికి ఝలక్ ఇచ్చిన బాబు....

జమ్మలమడుగులో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గి.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఆదినారాయణ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఝలక్ ఇచ్చినట్టుగా సమాచారం. జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ ఎవరికి అనే అంశంపై కసరత్తును చంద్రబాబు నాయుడు పూర్తి చేసినట్టుగా సమాచారం. ఈ టికెట్ కోసం ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేశాడు రామసుబ్బారెడ్డి. ఆదినారాయణ రెడ్డి చేతిలో ఓడాడు. అయితే ఫిరాయింపుతో […]

మంత్రికి ఝలక్ ఇచ్చిన బాబు....
X

జమ్మలమడుగులో గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెగ్గి.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఆదినారాయణ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఝలక్ ఇచ్చినట్టుగా సమాచారం. జమ్మలమడుగు అసెంబ్లీ టికెట్ ఎవరికి అనే అంశంపై కసరత్తును చంద్రబాబు నాయుడు పూర్తి చేసినట్టుగా సమాచారం.

ఈ టికెట్ కోసం ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డిలు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేశాడు రామసుబ్బారెడ్డి. ఆదినారాయణ రెడ్డి చేతిలో ఓడాడు. అయితే ఫిరాయింపుతో ఆది మంత్రి పదవిని చేపట్టాడు.

అలాగే.. ఆదికి, రామసుబ్బారెడ్డి కుటుంబానికి దశాబ్దాలుగా వైరం ఉంది. వీరిద్దరి మధ్యన ఫ్యాక్షన్ తగాదాలు కూడా ఉన్నాయి. గత కొన్నాళ్లుగా.. వీరిద్దరూ రాజీ పడ్డట్టుగా కనిపిస్తున్నారు. కమిషన్ల విషయంలో వీరిద్దరూ వాటాలు పంచుకొంటూ రాజీ పడ్డారని సమాచారం.

ఈ విషయాన్ని మంత్రి ఆది కూడా స్వయంగా చెప్పాడు. రామసుబ్బారెడ్డికి ఎంత వచ్చినా…. తనకు అందులో వాటా ఉంటుందని, తనకు వచ్చే డబ్బులో రామ సుబ్బారెడ్డికి వాటా ఉంటుందని ఆదినారాయణ రెడ్డి బహిరంగంగానే చెప్పాడు.

ఇక టికెట్ సంగతికి వస్తే.. రామసుబ్బారెడ్డి వైపే చంద్రబాబు నాయుడు మొగ్గు చూపినట్టుగా తెలుస్తోంది.

ఆదినారాయణ రెడ్డికి కడప ఎంపీ టికెట్ ను ఖరారు చేసినట్టుగా సమాచారం. అక్కడ నుంచి ఎలాగూ ఆది గెలవలేడు. ఫిరాయింపు మంత్రి కథ ఎలా ముగుస్తుందోనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

First Published:  6 Jan 2019 8:59 PM GMT
Next Story