Telugu Global
Cinema & Entertainment

"ఎన్టీఆర్" లో ఎన్టీఆర్ లేకపోవడానికి కారణం ఇదేనట

“ఎన్టీఆర్” బయోపిక్ సినిమా అనౌన్స్ చేయ్యగానే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ది ఖచ్చితంగా ఒక పాత్ర ఉంటుంది అని అందరూ భావించారు. అయితే సినిమా షూటింగ్ పూర్తయ్యి రిలీజ్ టైం దగ్గర పడేసరికి ఈ సినిమాలో ఎన్టీఆర్ లేడు అని తెలిసిపోయింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎందుకు నటించలేదు అనే దానికి ఒక కారణం చెప్పాడు కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ కు మాస్ లో విపరీతమైన ఇమేజ్ ఉంది. కానీ ఆ ఇమేజ్ కి […]

ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ లేకపోవడానికి కారణం ఇదేనట
X

“ఎన్టీఆర్” బయోపిక్ సినిమా అనౌన్స్ చేయ్యగానే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ది ఖచ్చితంగా ఒక పాత్ర ఉంటుంది అని అందరూ భావించారు. అయితే సినిమా షూటింగ్ పూర్తయ్యి రిలీజ్ టైం దగ్గర పడేసరికి ఈ సినిమాలో ఎన్టీఆర్ లేడు అని తెలిసిపోయింది.

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎందుకు నటించలేదు అనే దానికి ఒక కారణం చెప్పాడు కళ్యాణ్ రామ్. ఎన్టీఆర్ కు మాస్ లో విపరీతమైన ఇమేజ్ ఉంది. కానీ ఆ ఇమేజ్ కి తగ్గట్లుగా బయోపిక్ లో పాత్ర లేకపోవడంతో ఎన్టీఆర్ ని తీసుకోవద్దని బాలయ్య అనుకున్నాడట. దాంతో ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ ఈ సినిమాలో లేకుండా పోయాడట.

అయితే ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మాత్రం హరిక్రిష్ణ పాత్రలో నటించాడు. తన తండ్రి పాత్రని పోషించే అదృష్టం తనకు దక్కడంతో చాలా సంతోషంగా ఉంది ఉన్నాడు కళ్యాణ్ రామ్.

“ఎన్టీఆర్” బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ లేకపోయినా కనీసం వాయిస్ ఓవర్ అయినా ఇస్తాడని అనుకున్నారు. కానీ ఇప్పుడు అది కూడా లేదట.

క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా పై బాలక్రిష్ణ చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ ఆర్ ఫ్లాప్ అనేది పక్కన పెడితే…. తెలుగు ప్రేక్షకులకి “ఎన్టీఆర్” ఒక చక్కటి అనుభూతి అవుతుంది అని బాలక్రిష్ణ నమ్మకం అట.

First Published:  6 Jan 2019 1:31 AM GMT
Next Story