Telugu Global
International

21కోట్లకు అమ్ముడుపోయిన చేప....

జపాన్‌లో ఒక చేప రికార్డు ధరకు అమ్ముడుపోయింది. చేపేంటి ఇంత ధర పలకడం ఏంటి అని ఆశ్చర్యపోయేంతగా రికార్డు ధరను నమోదు చేసుకుంది. అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్న బ్లూపిన్‌ టూనా చేపకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉంది. జపాన్‌లో ఈ చేప మాంసం కోసం జనం తహతహలాడుతుంటారు. 278 కిలోల ఈ బ్లూపిన్ టూనాను టోక్యోలో వేలం నిర్వహించారు. హేమాహేమీలు దీన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఏకంగా 21 కోట్ల రూపాయలు చెల్లించి జపాన్‌ […]

21కోట్లకు అమ్ముడుపోయిన చేప....
X

జపాన్‌లో ఒక చేప రికార్డు ధరకు అమ్ముడుపోయింది. చేపేంటి ఇంత ధర పలకడం ఏంటి అని ఆశ్చర్యపోయేంతగా రికార్డు ధరను నమోదు చేసుకుంది. అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్న బ్లూపిన్‌ టూనా చేపకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత డిమాండ్ ఉంది. జపాన్‌లో ఈ చేప మాంసం కోసం జనం తహతహలాడుతుంటారు.

278 కిలోల ఈ బ్లూపిన్ టూనాను టోక్యోలో వేలం నిర్వహించారు. హేమాహేమీలు దీన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఏకంగా 21 కోట్ల రూపాయలు చెల్లించి జపాన్‌ సుషి రెస్టారెంట్‌ నిర్వాహకుడు దీన్ని సొంతం చేసుకున్నారు.

తాము ఊహించిన దాని కంటే అధిక ధరే చెల్లించాల్సి వచ్చిందని చేపను సొంతం చేసుకున్న వ్యాపారవేత్త అభిప్రాయపడ్డారు. అయినా సరే తమ రెస్టారెంట్‌కు వచ్చే కస్టమర్లు తమకు లాభాలు వచ్చే తరహాలోనే ఈ చేప మాంసం కోసం ధర చెల్లిస్తారన్న ధీమాను వ్యక్తం చేశాడు.

టూనా చేపలను గతంలో కూడా పలుమార్లు వేలం వేశారు. 2013లో ఒక చేప 9 కోట్ల 90 వేల రూపాయల ధర పలికింది. ఇప్పటి వరకు ఆ ధరే రికార్డుగా ఉండేది. కానీ ఈసారి రెట్టింపు ధరకు టూనా చేప అమ్ముడుపోయింది.

Next Story