Telugu Global
Cinema & Entertainment

ముచ్చటగా మూడో భేటీ.. ఈసారి ఏం జరుగుతుందో

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లాడు మహేష్ బాబు. అవన్నీ పూర్తిచేసుకొని ఇండియా వచ్చాడు. మహేష్ ఇలా హైదరాబాద్ వచ్చాడో లేదో అలా వెళ్లి అతడితో కథాచర్చలు సాగించాడు దర్శకుడు సుకుమార్. మహేష్-సుక్కూ మధ్య స్టోరీ డిస్కషన్లు జరగడం ఇదే ఫస్ట్ టైం కాదు. ఇంకా చెప్పాలంటే ఇది మూడోసారి. గతంలో సుకుమార్ చెప్పిన ఓ పీరియాడిక్ స్టోరీని నిర్మోహమాటంగా తిరస్కరించాడు మహేష్. ఆ తర్వాత ఓ సూపర్ కాప్ స్టోరీ చెప్పాడు. […]

ముచ్చటగా మూడో భేటీ.. ఈసారి ఏం జరుగుతుందో
X

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్లాడు మహేష్ బాబు. అవన్నీ పూర్తిచేసుకొని ఇండియా వచ్చాడు. మహేష్ ఇలా హైదరాబాద్ వచ్చాడో లేదో అలా వెళ్లి అతడితో కథాచర్చలు సాగించాడు దర్శకుడు సుకుమార్. మహేష్-సుక్కూ మధ్య స్టోరీ డిస్కషన్లు జరగడం ఇదే ఫస్ట్ టైం కాదు. ఇంకా చెప్పాలంటే ఇది మూడోసారి.

గతంలో సుకుమార్ చెప్పిన ఓ పీరియాడిక్ స్టోరీని నిర్మోహమాటంగా తిరస్కరించాడు మహేష్. ఆ తర్వాత ఓ సూపర్ కాప్ స్టోరీ చెప్పాడు. వన్-నేనొక్కడినే, స్పైడర్ సినిమాలకు దగ్గరగా ఉండడంతో ఆ కథను కూడా రిజెక్ట్ చేశాడు. ఇప్పుడు మహేష్ కోసం మరో లైన్ రాసుకొని అతడ్ని కలిశాడు సుకుమార్.

స్టోరీలైన్ విన్న మహేష్ బాబు ఇంకా తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. ఒకవేళ ఈ స్టోరీకి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, మహర్షి తర్వాత ఇదే సెట్స్ పైకి వెళ్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా స్టార్ట్ అవుతుంది.

First Published:  4 Jan 2019 10:42 PM GMT
Next Story