Telugu Global
Cinema & Entertainment

నిర్మాత అవతారం ఎత్తిన కొరటాల శివ ?

“మిర్చి” “జనత గ్యారేజ్” “భరత్ అనే నేను”….ఈ సినిమాల పేర్లు చెప్పగానే మనకి వెంటనే గుర్తొచ్చే పేరు కొరటాల శివ. ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీ హిట్స్ తీసి స్టార్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు కొరటాల శివ. ప్రస్తుతం కొరటాల శివ స్వయానా మెగా స్టార్ చిరంజీవిని డైరెక్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు.  ఒకవైపు ఆ పనుల్లో బిజీగా ఉంటూనే మరో వైపు సినిమాల్ని కూడా ప్రొడ్యూస్ చేద్దాం అనే […]

నిర్మాత అవతారం ఎత్తిన కొరటాల శివ ?
X
“మిర్చి” “జనత గ్యారేజ్” “భరత్ అనే నేను”….ఈ సినిమాల పేర్లు చెప్పగానే మనకి వెంటనే గుర్తొచ్చే పేరు కొరటాల శివ. ఇండస్ట్రీ కి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీ హిట్స్ తీసి స్టార్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు కొరటాల శివ. ప్రస్తుతం కొరటాల శివ స్వయానా మెగా స్టార్ చిరంజీవిని డైరెక్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. ఒకవైపు ఆ పనుల్లో బిజీగా ఉంటూనే మరో వైపు సినిమాల్ని కూడా ప్రొడ్యూస్ చేద్దాం అనే ఆలోచనలో కొరటాల శివ ఉన్నట్టు తెలుస్తుంది,
కానీ ఈ సినిమాలకి అతని ఫ్రెండ్ మిక్కిలినేని సుధాకర్ డబ్బులు పెడతాడు. కొరటాల బెస్ట్ ఫ్రెండ్ ఫ్రెండ్, డిస్ట్రిబ్యూటర్ మిక్కిలినేని సుధాకర్ గత కొంతకాలంగా సినిమాలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సుధాకర్ ఓ సినిమా ప్లాన్ చేసాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఒక కొత్త దర్శకుడిని, అప్ కమింగ్ హీరోని పెట్టి సుధాకర్ ని నిర్మాతగా పెట్టి తానూ సమర్పకుడిగా ఉండి సినిమా తీయాలి అనుకుంటున్నాడు అంట కొరటాల శివ.
First Published:  4 Jan 2019 10:12 PM GMT
Next Story