"మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్"ను ప్రయోగించిన చైనా
పొరుగు దేశం చైనా అన్ని రంగాల్లోనూ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. ఉత్పత్తి రంగంలో సత్తా చాటుతున్న చైనా దేశ రక్షణ కోసం కూడా భారీగా ఖర్చు చేస్తోంది. అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తోంది. తాజాగా అత్యంత శక్తివంతమైన బాంబును తయారు చేసింది. అమెరికా వద్ద ఉన్న మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌కు పోటీగా, మరింత శక్తివంతంగా బాంబును తయారు చేసింది. దీన్ని ప్రయోగించి పరీక్షించింది. అందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. అణ్వాయుధం తర్వాత ప్రపంచంలో […]

పొరుగు దేశం చైనా అన్ని రంగాల్లోనూ ప్రపంచానికి సవాల్ విసురుతోంది. ఉత్పత్తి రంగంలో సత్తా చాటుతున్న చైనా దేశ రక్షణ కోసం కూడా భారీగా ఖర్చు చేస్తోంది. అత్యాధునిక ఆయుధాలను తయారు చేస్తోంది. తాజాగా అత్యంత శక్తివంతమైన బాంబును తయారు చేసింది.
అమెరికా వద్ద ఉన్న మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌కు పోటీగా, మరింత శక్తివంతంగా బాంబును తయారు చేసింది. దీన్ని ప్రయోగించి పరీక్షించింది. అందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేసింది. అణ్వాయుధం తర్వాత ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనవి ఈ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్సే. అమెరికా వీటిని తొలుత తయారు చేసింది. ఈ ఎంవోఏబీల అసలు పేరు మ్యాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్.
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ఉగ్ర శిబిరాలను నిర్మూలించేందుకు గతంలో అమెరికా ఈ బాంబులనే ప్రయోగించింది. దీన్ని యుద్ధ విమానాల నుంచి కిందకు జారవిడుస్తారు. ఈ బాంబులు పెను విధ్వంసాన్ని సృష్టిస్తాయి. భారీ కట్టడాలు, సైనిక శిబిరాలను నామరూపాల్లేకుండా నేలమట్టం చేసే సామర్థ్యం ఈ బాంబుల సొంతం.
దట్టమైన అడవుల్లో సైనిక శిబిరాన్ని తక్షణం ఏర్పాటు చేసుకోవాల్సి వస్తే తొలుత అమెరికా ఈ బాంబునే పైనుంచి విడిచేసింది. ఈ బాంబు సదరు ప్రాంతంలో చెట్లను బూడిద చేసేసేది. ఆ తర్వాత సైనికులు అక్కడికి దిగి శిబిరాన్ని ఏర్పాటు చేసుకుంటారు. చైనా తాజాగా రూపొందించిన ఈ బాంబు అమెరికా ఎంవోఏబీల కంటే శక్తివంతమైనది.
అమెరికా ఎంవోఏబీల సైజు కూడా భారీగా ఉండేది. కానీ చైనా తక్కువ సైజుతోనే ఈ మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్‌ను రూపొంచింది. హెచ్-6కె యుద్ధవిమానం ద్వారా ఈ బాంబును జారవిడిచి అది సృష్టించే విధ్వంసాన్ని రికార్డు చేసి విడుదల చేసింది.