Telugu Global
NEWS

గన్‌మెన్లను వెనక్కు పంపిన మంత్రి అఖిలప్రియ

మంత్రి భూమా అఖిలప్రియ తనకు భద్రతగా వచ్చిన పోలీస్ సిబ్బందిని వెనక్కు పంపడం చర్చనీయాంశమైంది. ఫరూక్ మంత్రిగా నియమితులైన తర్వాత కర్నూలు జిల్లాలో ఫరూక్‌కు, భూమా కుటుంబానికి మధ్య పరోక్షంగా పోరు నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో నంద్యాల టికెట్ ఆశిస్తున్న ఫరూక్‌…. ఇటీవల మంత్రి పదవి వచ్చాక భూమా కుటుంబానికి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. భూమా అనుచరులను టార్గెట్ చేసుకుని పోలీసు దాడులు జరుగుతున్నాయి. ప్రస్తుతం జిల్లా పోలీసులు మంత్రి ఫరూక్ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారన్నది భూమా […]

గన్‌మెన్లను వెనక్కు పంపిన మంత్రి అఖిలప్రియ
X

మంత్రి భూమా అఖిలప్రియ తనకు భద్రతగా వచ్చిన పోలీస్ సిబ్బందిని వెనక్కు పంపడం చర్చనీయాంశమైంది. ఫరూక్ మంత్రిగా నియమితులైన తర్వాత కర్నూలు జిల్లాలో ఫరూక్‌కు, భూమా కుటుంబానికి మధ్య పరోక్షంగా పోరు నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో నంద్యాల టికెట్ ఆశిస్తున్న ఫరూక్‌…. ఇటీవల మంత్రి పదవి వచ్చాక భూమా కుటుంబానికి చెక్ పెట్టేందుకు పావులు కదుపుతున్నారు. భూమా అనుచరులను టార్గెట్ చేసుకుని పోలీసు దాడులు జరుగుతున్నాయి.

ప్రస్తుతం జిల్లా పోలీసులు మంత్రి ఫరూక్ కనుసన్నల్లోనే పనిచేస్తున్నారన్నది భూమా వర్గం ఆరోపణ. ఇందుకు బలాన్ని చేకూర్చేలా రెండు రోజలు క్రితం ఆళ్లగడ్డలోని భూమా అఖిలప్రియ అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. ఇలా మంత్రి అనుచరుల ఇళ్లలోనే పోలీసులు సోదాలు చేయడం దుమారం రేపింది.

ఈ దాడులపై అఖిలప్రియ అసంతృప్తిగా ఉన్నారు. ఇంతలో జిల్లాలోని రుద్రవరం మండలంలోని నరసాపురం గ్రామంలో పర్యటించేందుకు అఖిలప్రియ వచ్చారు. విషయం తెలుసుకున్న స్థానిక సీఐ, ఎస్‌ఐ, పోలీసులు భద్రత కల్పించేందుకు వచ్చారు. అందుకు అఖిలప్రియ అంగీకరించలేదు. స్థానిక పోలీసులతో పాటు తన గన్‌మెన్లను కూడా వెనక్కు పంపించారు. గన్‌మెన్లు లేకుండానే ఆమె గ్రామంలో పర్యటించారు.

ఇలా గన్‌మెన్లను వెనక్కు పంపించడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… తమ వర్గీయులకే భద్రత లేకుండా పోయినప్పుడు ఇక తనకు మాత్రం భద్రత ఎందుకని ప్రశ్నించారు. తన అనుచరుల ఇళ్లపైనే పోలీసులు దాడులు చేసి సోదాలు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. ఆళ్లగడ్డను టార్గెట్‌గా చేసుకుని రాజకీయం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

First Published:  4 Jan 2019 11:35 PM GMT
Next Story