జగన్‌పై హత్యాయత్నం కేసు ఎన్‌ఐఏ విచారణాధికారి ఈయనే...
విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఏపీ హైకోర్టు ఎన్‌ఐఏకు అప్పగించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కేసును ఎన్‌ఐఏకు అప్పగించడంపై స్పందన తెలియజేయాలని ఇది వరకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేసును ఎన్‌ఐఏకు అప్పగించేందుకు అంగీకరించింది. జగన్ కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. జగన్‌పై దాడి కేసు విచారణ జనవరి ఒకటి నుంచే […]
విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును ఏపీ హైకోర్టు ఎన్‌ఐఏకు అప్పగించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కేసును ఎన్‌ఐఏకు అప్పగించడంపై స్పందన తెలియజేయాలని ఇది వరకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కేసును ఎన్‌ఐఏకు అప్పగించేందుకు అంగీకరించింది.
జగన్ కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. జగన్‌పై దాడి కేసు విచారణ జనవరి ఒకటి నుంచే హైదరాబాద్ ఎన్‌ఐఏ విభాగానికి బదిలీ అయినట్టు వెల్లడించింది. సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాడెంట్ ఫిర్యాదుతో ఎన్‌ఐఏ కేసు నమోదు చేసినట్టు చెప్పింది.
జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణకు ఎన్‌ఐఏ అడిషనల్ ఎస్పీ సాజిద్ ఖాన్‌ను అధికారిగా నియమించారు. కేసు ఎన్‌ఐఏ చేతికి వెళ్లిన నేపథ్యంలో నిందితుడు శ్రీనివాస్‌ను ఎన్ ఐఏ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
శ్రీనివాస్‌కు సహకరించినట్టు భావిస్తున్న రెస్టారెంట్ యజమాని హర్షవర్థన్ చౌదరితో పాటు అనుమానితుల్ని ఎన్‌ఐఏ విచారించనుంది. అయితే కేసును ఎన్‌ఐఏకు అప్పగించడంపై ఏపీ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. కేసును ఎన్‌ఐఏకు అప్పగించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది.