Telugu Global
Cinema & Entertainment

వెంకటేష్ అభిమానుల్లో బిగ్ బాస్ చిచ్చు

నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న విక్టరీ వెంకటేశ్ అభిమానుల్లో ఇప్పుడు కొత్త లొల్లి మొదలైంది. ఇప్పటి వరకు ఒకటిగా ఉంటూ వెంకీ సినిమాలను ఆదరిస్తూ వస్తున్న అభిమానుల గొడవకు కారణమేటంటే ‘బిగ్ బాస్’. స్టార్ మాలో బిగ్ బాస్ షో వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మొదట జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవరహరించాడు. అనంతరం నాని హోస్ట్ గా ఉన్నాడు. తాజాగా స్టార్ మా బిగ్ బాస్ మూడో సీజన్ కు ప్లాన్ చేస్తోంది. ఇందులో […]

వెంకటేష్ అభిమానుల్లో బిగ్ బాస్ చిచ్చు
X

నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న విక్టరీ వెంకటేశ్ అభిమానుల్లో ఇప్పుడు కొత్త లొల్లి మొదలైంది. ఇప్పటి వరకు ఒకటిగా ఉంటూ వెంకీ సినిమాలను ఆదరిస్తూ వస్తున్న అభిమానుల గొడవకు కారణమేటంటే ‘బిగ్ బాస్’.

స్టార్ మాలో బిగ్ బాస్ షో వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మొదట జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవరహరించాడు. అనంతరం నాని హోస్ట్ గా ఉన్నాడు.

తాజాగా స్టార్ మా బిగ్ బాస్ మూడో సీజన్ కు ప్లాన్ చేస్తోంది. ఇందులో వెంకటేశ్ ను హోస్ట్ గా చేయాలని ఆలోచిస్తోంది. ఈ విషయం ఆనోటా ఈనోటా అభిమానులకు చేరినా వారికి నచ్చడం లేదు. తమ హీరో బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తే నష్టం వాటిల్లుతుందని కొంతమంది అభిమానులు భావిస్తుంటే బిగ్ బాస్ చేయాలని మరికొంత మంది అభిమానులు పట్టు బడుతున్నారు.

బిగ్ బాస్ చేయడం ద్వారా ప్రతీ కుటుంబానికి వెంకి దగ్గరవుతారని కొంతమంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుందని భావిస్తున్నారు. మరికొంతమంది మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలూ లేని వెంకి చిక్కుల్లో పడతారని… బిగ్ బాస్ షోతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు.

వెంకి అభిమానుల లొల్లిలో వాస్తవం ఉన్నా లేకపోయినా గతంలో చాలా సందర్భాల్లో నాని బిగ్ బాస్ విషయమై విమర్శలు ఎదుర్కొన్నాడు. అతడి సినిమాలపై కూడా ప్రభావం చూపింది. వెంకటేష్ కూడా అలాంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందనేది వారి వాదన. ఈ విషయంలో విక్టరీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అభిమానులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు.

First Published:  3 Jan 2019 12:35 AM GMT
Next Story