Telugu Global
NEWS

శివాజీకి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ?

హీరో క‌మ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు శివాజీ అలియాస్ సొంటినేని శివాజీ చౌద‌రి ఆప‌రేష‌న్ గ‌రుడ‌తో ఫేమ‌స్ అయ్యారు. ఏపీ రాజ‌కీయాల్లో కుట్ర సిద్దాంతాలు వినిపిస్తున్నారు. తాజాగా తెలుగుదేశంపై మ‌రో కుట్ర జ‌రుగుతుంద‌ని అంటూ చుక్క‌ల భూముల లెక్క‌లు తీసుకొచ్చారు. అయితే శివాజీ మొదట్లో ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి పేరిట ప్రెస్‌మీట్‌లు పెట్టేవారు. త‌ర్వాత బీజేపీకి టీడీపీ రాంరాం చెప్పిన త‌ర్వాత హోదాను ప‌క్క‌న‌ పెట్టేశారు. కేవ‌లం కుట్ర‌ల గురించే వివ‌రించేందుకు మీడియా ముందుకు వ‌స్తున్నారు. అమ‌రావ‌తిలో […]

శివాజీకి టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ?
X

హీరో క‌మ్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు శివాజీ అలియాస్ సొంటినేని శివాజీ చౌద‌రి ఆప‌రేష‌న్ గ‌రుడ‌తో ఫేమ‌స్ అయ్యారు. ఏపీ రాజ‌కీయాల్లో కుట్ర సిద్దాంతాలు వినిపిస్తున్నారు. తాజాగా తెలుగుదేశంపై మ‌రో కుట్ర జ‌రుగుతుంద‌ని అంటూ చుక్క‌ల భూముల లెక్క‌లు తీసుకొచ్చారు. అయితే శివాజీ మొదట్లో ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి పేరిట ప్రెస్‌మీట్‌లు పెట్టేవారు. త‌ర్వాత బీజేపీకి టీడీపీ రాంరాం చెప్పిన త‌ర్వాత హోదాను ప‌క్క‌న‌ పెట్టేశారు. కేవ‌లం కుట్ర‌ల గురించే వివ‌రించేందుకు మీడియా ముందుకు వ‌స్తున్నారు.

అమ‌రావ‌తిలో ఇప్పుడు ఒక చ‌ర్చ న‌డుస్తోంది. కుట్ర సిద్ధాంతాల పేరుతో టీడీపీకి మైలేజీ తీసుకొస్తున్న శివాజీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తార‌ని టాక్ విన్పిస్తోంది. ఆయ‌న‌కు అండ‌గా ఉండే ఓ టీవీ చాన‌ల్ అధిప‌తికి చంద్ర‌బాబు ఈ విష‌యం చెప్పార‌ని స‌మాచారం.

గుంటూరు జిల్లాలో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి శివాజీ పోటీ చేస్తార‌ని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్ప‌టినుంచే ఆయ‌న గ్రౌండ్ వ‌ర్క్ చేస్తున్నార‌ని అంటున్నారు. శివాజీ చౌద‌రి ఇప్పుటికే అనువైన నియోజ‌క‌వ‌ర్గం వేట‌లో ఉన్నారు. అయితే శివాజీది న‌ర్స‌రావుపేట‌. ఇక్క‌డి నుంచి ఆయ‌న పోటీ చేస్తారా? లేక వేరే నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టిపెడ‌తారా అనేది చూడాలి.

First Published:  3 Jan 2019 12:59 AM GMT
Next Story