Telugu Global
National

సీఎం కుమారస్వామి భార్యతో సహా.... కన్నడ సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు

కన్నడ సినీ పరిశ్రమ.. శాండల్‌వుడ్ ప్రముఖులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇవాళ ఉదయం నుంచి దాడులు ప్రారంభించారు. బెంగుళూరులో ఉన్న సినీ నిర్మాతలు, దర్శకులు, నటుల ఇళ్లను ఐటీ అధికారులు లక్ష్యం చేసుకొని భారీగా దాడులు చేస్తున్నారు. కర్నాటక సీఎం కుమారస్వామి భార్య, సినీ నటి రాధిక, నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఇళ్లపై కూడా ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏక కాలంలో నగరంలోని 60 ప్రాంతాల్లో దాడులకు దిగడం చర్చనీయాంశం అయ్యింది. సినీ ప్రముఖులు […]

సీఎం కుమారస్వామి భార్యతో సహా.... కన్నడ సినీ ప్రముఖుల ఇళ్లపై ఐటీ దాడులు
X

కన్నడ సినీ పరిశ్రమ.. శాండల్‌వుడ్ ప్రముఖులపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఇవాళ ఉదయం నుంచి దాడులు ప్రారంభించారు. బెంగుళూరులో ఉన్న సినీ నిర్మాతలు, దర్శకులు, నటుల ఇళ్లను ఐటీ అధికారులు లక్ష్యం చేసుకొని భారీగా దాడులు చేస్తున్నారు.

కర్నాటక సీఎం కుమారస్వామి భార్య, సినీ నటి రాధిక, నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఇళ్లపై కూడా ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఏక కాలంలో నగరంలోని 60 ప్రాంతాల్లో దాడులకు దిగడం చర్చనీయాంశం అయ్యింది.

సినీ ప్రముఖులు చాలా మంది గత కొంత కాలంగా ఐటీ రిటర్న్స్ సక్రమంగా దాఖలు చేయకపోవడంతో పాటు…. ఆదాయానికి సంబంధించిన రికార్డులను మెయింటైన్ చేయట్లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఆదాయ పన్నుల శాఖకు పలు పిర్యాదులు కూడా అందాయి. ఈ నేపథ్యంలోనే ఒకే సారి సినీ ప్రముఖుల అందరిపై ఏక కాలంలో దాడులకు దిగినట్లు తెలుస్తోంది.

కొత్త సంవత్సరం తొలి వారంలోనే సినీ పరిశ్రమపై ఐటీ పిడుగు పడటం సంచలనంగా మారింది. ఇప్పటికీ దాడులు కొనసాగు తుండటంతో ఎవరెవరి వద్ద ఎంత అక్రమ సొమ్ము లభించిందనే వివరాలు ఇంకా తెలియరాలేదు.

First Published:  3 Jan 2019 1:34 AM GMT
Next Story