Telugu Global
NEWS

అమ్మాయిలూ.... దుర్గమ్మ దర్శనానికి ఈ రూల్స్ పాటించాల్సిందే!

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో జనవరి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల్లో కొందరి వస్త్రధారణ సరిగ్గా లేదంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టారు. ఇకపై అమ్మవారిని దర్శించుకోవాలంటే సంప్రదాయ దుస్తుల్లో రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కొత్త నిబంధనల ప్రకారం…..ష్యాషనబుల్ దుస్తులు ధరించి ఆలయ ప్రాంగణంలోకి వస్తే అనుమతించరు. భక్తులంతా తప్పనిసరిగా… సంప్రదాయ దుస్తులనే ధరించాలి. పురుషులు ఫ్యాంట్, షర్టు లేదా […]

అమ్మాయిలూ.... దుర్గమ్మ దర్శనానికి ఈ రూల్స్ పాటించాల్సిందే!
X

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో జనవరి 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల్లో కొందరి వస్త్రధారణ సరిగ్గా లేదంటూ విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు డ్రెస్ కోడ్ ప్రవేశపెట్టారు. ఇకపై అమ్మవారిని దర్శించుకోవాలంటే సంప్రదాయ దుస్తుల్లో రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ కొత్త నిబంధనల ప్రకారం…..ష్యాషనబుల్ దుస్తులు ధరించి ఆలయ ప్రాంగణంలోకి వస్తే అనుమతించరు. భక్తులంతా తప్పనిసరిగా… సంప్రదాయ దుస్తులనే ధరించాలి. పురుషులు ఫ్యాంట్, షర్టు లేదా పంచె, లుంగీ ధరించి రావాలి. షాట్స్, స్లీవ్ లెస్ టీ షర్టులు వేసుకుంటే అనుమతించరు.

ఇక మహిళలు చీరలు, లంగా వోణీలు ధరించి రావాలి. పంజాబీ డ్రెస్సులు కూడా వేసుకోవచ్చు. చున్నీ తప్పనిసరిగా ఉండాలి. జీన్స్ టీషర్ట్ లు వేసుకుని వచ్చే వారికి దర్శనానికి అనుమతి ఉండదని ఇంద్రకీలాద్రి ఈవో వి. కోటేశ్వరమ్మ స్పష్టం చేశారు.

మ‌హిళా భ‌క్తులు సంప్రదాయ దుస్తులు వెంట తెచ్చుకోకుంటే…. ఇంద్ర‌కీలాద్రి ఆలయ ప్రాంగణంలోనే దేవస్థానం ఆధ్వ‌ర్యంలో నిర్వహించే ప్రత్యేక కౌంటర్‌లో అందుబాటులో ఉండే చీర‌ల‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చున‌ని కోటేశ్వ‌ర‌మ్మ తెలిపారు. ఒక్కో చీర ఖ‌రీదు రూ.100 అని వెల్ల‌డించారు.

First Published:  2 Jan 2019 12:06 AM GMT
Next Story