Telugu Global
NEWS

ఆఫర్ ఇస్తున్నా తమవల్ల కాదంటున్న కాంగ్రెస్ నేతలు....

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇలాంటి నేపథ్యంలో ఆ పార్టీకి ఈ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థులు దొరకడం కూడా కష్టం అయ్యేలా ఉంది. తెలంగాణలోని పదిహేడు ఎంపీ సీట్ల పరిధిలో కేవలం ఒక్క ఎంపీ సీటు పరిధిలో మాత్రమే కాంగ్రెస్ కు కాస్తంత చెప్పుకోదగిన మెజారిటీ వచ్చింది. ఇక మిగతా చోట్లలో ఏదో బోటాబోటీ మెజారిటి దక్కింది. ఇక హైదరాబాద్ ను మినహాయిస్తే పద్నాలుగు ఎంపీ సీట్ల పరిధిలో […]

ఆఫర్ ఇస్తున్నా తమవల్ల కాదంటున్న కాంగ్రెస్ నేతలు....
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇలాంటి నేపథ్యంలో ఆ పార్టీకి ఈ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థులు దొరకడం కూడా కష్టం అయ్యేలా ఉంది.

తెలంగాణలోని పదిహేడు ఎంపీ సీట్ల పరిధిలో కేవలం ఒక్క ఎంపీ సీటు పరిధిలో మాత్రమే కాంగ్రెస్ కు కాస్తంత చెప్పుకోదగిన మెజారిటీ వచ్చింది. ఇక మిగతా చోట్లలో ఏదో బోటాబోటీ మెజారిటి దక్కింది. ఇక హైదరాబాద్ ను మినహాయిస్తే పద్నాలుగు ఎంపీ సీట్ల పరిధిలో తెరాస పూర్తి మెజారిటీ సాధించింది.

ఇలాంటి నేపథ్యంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ సీట్ల నుంచి పోటీ చేసే ధైర్యం ఎవరికైనా ఉంటుందా అనే ప్రశ్న తలెత్తుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు చాలా మంది అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. వారిలో కొందరు ఎంపీలుగా బరిలోకి దిగనున్నారు.

మరి వారి సంగతేమో కానీ.. కాంగ్రెస్ కు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అభ్యర్థులు దొరకడం కష్టమే అనే విశ్లేషణ వినిపిస్తోంది.

తాజాగా కాంగ్రెస్ నుంచి ఒక వికెట్ పడటం ఖాయమైందని సమాచారం. కొన్నేళ్ల కిందట కాంగ్రెస్ లో చేరిన మాజీ క్రికెటర్ అజరుద్ధీన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నాడని తెలుస్తోంది.

ఇటీవలే అజ్జూకు కాంగ్రెస్ హై కమాండ్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పదవి కూడా ఇచ్చింది. అయినా అజర్ కాంగ్రెస్ లో నిలవడని తెలుస్తోంది. ఆయన తెరాసలో చేరబోతున్నాడని వినిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడే ఈ వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే జరగబోతోంది. అజ్జూ తెరాసలో చేరతాడని.. ఆ పార్టీ తరఫున సికింద్రా బాద్ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నాడని తెలుస్తోంది.

First Published:  1 Jan 2019 9:35 PM GMT
Next Story