ఆసీస్- టీమిండియా టెస్ట్ సిరీస్ లో ఆఖరాట
సిడ్నీ స్టేడియంలో కీలకసమరానికి కౌంట్ డౌన్ కంగారు గడ్డపై తొలి సిరీస్ విజయానికి టీమిండియా గురి మొదటి మూడుటెస్టుల్లో 2-1తో టీమిండియా పైచేయి ఏడు దశాబ్దాలుగా కంగారూగడ్డపై సిరీస్ విజయం లేని భారత్ కంగారూ గడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో…చారిత్రాత్మక విజయానికి…టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా ఉరకలేస్తోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా… మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఆఖరిటెస్ట్ లోనూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. కొత్త సంవత్సరాన్ని విజయంతో సరికొత్తగా […]
- సిడ్నీ స్టేడియంలో కీలకసమరానికి కౌంట్ డౌన్
- కంగారు గడ్డపై తొలి సిరీస్ విజయానికి టీమిండియా గురి
- మొదటి మూడుటెస్టుల్లో 2-1తో టీమిండియా పైచేయి
- ఏడు దశాబ్దాలుగా కంగారూగడ్డపై సిరీస్ విజయం లేని భారత్
కంగారూ గడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో…చారిత్రాత్మక విజయానికి…టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా ఉరకలేస్తోంది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా… మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఆఖరిటెస్ట్ లోనూ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. కొత్త సంవత్సరాన్ని విజయంతో సరికొత్తగా ప్రారంభించాలన్న పట్టుదలతో ఉంది.
టీమిండియా-1, ఆసీస్-5…
టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంకర్ టీమిండియా, 5వ ర్యాంకర్ ఆస్ట్రేలియా జట్ల నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ నీకొకటి.. నాకొకటి అన్నట్లుగా సాగుతోంది. సిరీస్ లోని మొదటి, మూడు టెస్టుల్లో టీమిండియా నెగ్గితే…పెర్త్ వేదికగా జరిగిన రెండోటెస్టులో ఆతిథ్య ఆసీస్ విజేతగా నిలిచింది.
బాక్సింగ్ డే టెస్ట్ గెలుపుతో సిరీస్ పై 2-1తో పట్టు బిగించిన టీమిండియా… సిడ్నీ వేదికగా మరికొద్ది గంటల్లో ప్రారంభమయ్యే ఆఖరిటెస్ట్ లో నాకౌట్ పంచ్ విసరడం ద్వారా…సరికొత్త చరిత్ర సృష్టించాలన్న పట్టుదలతో ఉంది.
తొలి సిరీస్ కు టీమిండియా గురి…
ఆస్ట్రేలియాలో గత ఏడు దశాబ్దాలుగా టెస్ట్ సిరీస్ లు ఆడుతూ వచ్చిన టీమిండియా …ఇప్పటి వరకూ కంగారూ గడ్డపై ఒక్కసారీ సిరీస్ నెగ్గిన పాపానపోలేదు.
అయితే…ప్రస్తుత సిరీస్ లోని ఆఖరిటెస్టులో టీమిండియా విజేతగా నిలిస్తే….ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి…తొలిసారిగా సిరీస్ గెలుచుకోగలుగుతుంది. ఒకవేళ సిడ్నీ టెస్టును టీమిండియా డ్రాగా ముగించినా… బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని నిలుపుకోనే అవకాశం ఉంది.
11 టెస్టుల్లో ఒక్కటే గెలుపు…
మెల్బోర్న్ వేదికగా ముగిసిన బాక్సింగ్ డే టెస్టులో సాధించిన విజయం జోష్ తో … ఆఖరిటెస్ట్ సమరానికి విరాట్ అండ్ కో సిద్ధమయ్యారు.
అయితే… కంగారూ విజయాల అడ్డాలో… టీమిండియాకు ఒకే ఒక్క గెలుపు మాత్రమే ఉంది. 1947 సిరీస్ నుంచి 2015 సిరీస్ వరకూ… సిడ్నీ వేదికగా 11 టెస్టులు ఆడిన టీమిండియాకు 5 పరాజయాలు, 5 డ్రాలు, ఓగెలుపు రికార్డు మాత్రమే ఉంది.
సిడ్నీ స్టేడియంలో టెస్ట్ విజయం తో పాటు సిరీస్ విజయం లేని లోటును ప్రస్తుత ఆఖరిటెస్ట్ ద్వారా తీర్చుకోవాలన్న కసితో టీమిండియా ఉంది.
టాస్ నెగ్గితే మ్యాచ్ నెగ్గినట్లే….
పేస్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ కు అనువుగా ఉండే సిడ్నీ పిచ్ పైన సైతం టాస్ కీలకం కానుంది. కెప్టెన్ గా విరాట్ కొహ్లీ ఇప్పటి వరకూ టాస్ నెగ్గిన 21 మ్యాచ్ ల్లోనూ…టీమిండియానే విజేతగా నిలిచింది.
మరోవైపు…టీమిండియా యువవికెట్ కీపర్ రిషభ్ పంత్…ప్రస్తుత సిరీస్ లోని మొదటి మూడు టెస్టుల్లోనే 20 క్యాచ్ లు అందుకొని… సరికొత్త రికార్డు నెలకొల్పాడు. నరేన్ తమ్హానే, సయ్యద్ కిర్మాణీల పేరుతో ఉన్న.. 19 క్యాచ్ ల రికార్డును మెల్బోర్న్ టెస్టుతోనే అధిగమించిన రిషభ్… ఆఖరి టెస్టులో తన రికార్డును మరింతగా మెరుగుపరచుకొనే అవకాశం ఉంది.
నాకౌట్ పంచ్ కు టీమిండియా రెడీ…
సిడ్నీ వేదికగా టీమిండియా రికార్డు అంతంత మాత్రంగా ఉన్నా… ప్రస్తుత ఆఖరిటెస్టులో సైతం టీమిండియానే హాట్ ఫేవరెట్ గా పోటీకి దిగుతోంది. కంగారూలపై నాకౌట్ పంచ్ విసరడానికి ఉరకలేస్తోంది.
జనవరి 3 నుంచి ఐదురోజులపాటు జరిగే ఈ ఆఖరాటలో టీమిండియా నెగ్గినా… మ్యాచ్ ను డ్రాగా ముగించినా అది సరికొత్త చరిత్రే అవుతుంది.