Telugu Global
NEWS

అది ఫాల్స్‌ న్యూస్ " అజార్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలు కుదేలైపోయారు. కనీసం మీడియా ముందుకు వచ్చేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో పలువురు నేతలు టీఆర్‌ఎస్‌ వైపు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన మెజారిటీ ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇదే సమయంలో మాజీ క్రికెటర్, టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌ కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారంటూ కొద్ది రోజులుగా తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీగా అజార్‌ పోటీ చేస్తారని.. […]

అది ఫాల్స్‌ న్యూస్  అజార్‌
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలు కుదేలైపోయారు. కనీసం మీడియా ముందుకు వచ్చేందుకు కూడా ఆసక్తి చూపడం లేదు. అదే సమయంలో పలువురు నేతలు టీఆర్‌ఎస్‌ వైపు అడుగులు వేస్తున్నారు.

ఇప్పటికే కాంగ్రెస్‌కు చెందిన మెజారిటీ ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. ఇదే సమయంలో మాజీ క్రికెటర్, టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌ కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారంటూ కొద్ది రోజులుగా తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది.

లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ నుంచి ఎంపీగా అజార్‌ పోటీ చేస్తారని.. ఈమేరకు టీఆర్‌ఎస్‌తో డీల్ సెట్ అయిందని వార్తలొచ్చాయి. ఈ వార్తలపై అజార్ స్పందించారు. ట్వీట్టర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

తాను టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటినిజం లేదన్నారు. అవన్నీ తప్పుడు వార్తలని అజార్ కొట్టిపారేశారు.

First Published:  2 Jan 2019 6:29 AM GMT
Next Story