Telugu Global
NEWS

కొత్త కుట్ర కథ చెప్పిన నటుడు శివాజీ

నటుడు శివాజీ మరో కుట్ర కథ చెప్పారు. ఆపరేషన్ గరుడాతో హడావుడి చేసిన శివాజీ ఇప్పుడు చంద్రబాబుపై మరో కుట్ర జరుగుతోందన్నారు. చుక్కల భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి… చంద్రబాబును దెబ్బతీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ల పై మండిపడ్డారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన నటుడు శివాజీ… చుక్కల భూముల పేరుతో పేదల నుంచి భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. కొందరు అధికారులే ఈ పని చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వానికి ప్రజలను దూరం చేసి వ్యతిరేకత […]

కొత్త కుట్ర కథ చెప్పిన నటుడు శివాజీ
X

నటుడు శివాజీ మరో కుట్ర కథ చెప్పారు. ఆపరేషన్ గరుడాతో హడావుడి చేసిన శివాజీ ఇప్పుడు చంద్రబాబుపై మరో కుట్ర జరుగుతోందన్నారు. చుక్కల భూముల వ్యవహారంలో ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చి… చంద్రబాబును దెబ్బతీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ల పై మండిపడ్డారు.

విజయవాడలో మీడియాతో మాట్లాడిన నటుడు శివాజీ… చుక్కల భూముల పేరుతో పేదల నుంచి భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు. కొందరు అధికారులే ఈ పని చేస్తున్నారని చెప్పారు.

ప్రభుత్వానికి ప్రజలను దూరం చేసి వ్యతిరేకత తీసుకొచ్చే కుట్రతోనే చుక్కల భూములతో కుట్ర చేస్తున్నారన్నారు. ఈ చుక్కల భూముల వ్యవహారం 12 లక్షల మందికి సంబంధించినదన్నారు.

అలా చేస్తున్న నలుగురు అధికారులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు చెప్పారు.

ముఖ్యమంత్రిని కలిసి వివరాలు అందజేసిన తర్వాతే ఆ అధికారుల పేర్లను బయటపెడుతానన్నారు. చంద్రబాబుపై ఇదో కొత్త తరహా దాడి అని శివాజీ ఆరోపించారు. టీడీపీకి ఓటర్లను దూరం చేసే కుట్ర నడుస్తోందని చెప్పారు.

రాజకీయాలను చేయాలనుకుంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్లి విపక్షంలో చేరాలని శివాజీ వ్యాఖ్యానించారు. అధికారులు విడుదల చేసిన జీవో గురించి పవన్‌ కల్యాణ్ కూడా తెలుసుకోవాలన్నారు. చుక్కల భూములు జిల్లా కలెక్టర్ అబ్బ సొత్తా అని శివాజీ ప్రశ్నించారు. కలెక్టర్‌ అయ్య సొమ్మా… తాత సొమ్మా అని మండిపడ్డారు.

ఈ అక్రమాలపై చంద్రబాబు సీరియస్‌ అయినా సరే అధికారులు లెక్కచేయడం లేదన్నారు. చంద్రబాబు నచ్చకపోతే అధికారులు లాంగ్ లీవ్ పెట్టి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. జగన్‌కు సీఎం కుర్చీ కావాలే గానీ… ప్రజాసమస్యలు మాత్రం పట్టవన్నారు. ఉడత ఊపులకు భయపడే వ్యక్తిని తాను కాదన్నారు.

First Published:  2 Jan 2019 7:01 AM GMT
Next Story