Telugu Global
NEWS

హైటెక్ సిటీ నాదే... న్యూఇయర్‌ కిక్‌లో రోడ్డుపై పొర్లిన యువకుడు

న్యూఇయర్ సందర్భంగా కొందరు మందుబాబులు రెచ్చిపోయారు. ఈ ప్రపంచమే తమదన్నట్టుగా తాగి ఊగిపోయారు. కొందరు మందుబాబులు పోలీసులకూ చుక్కలు చూపించారు. తాగి డ్రైవ్ చేయవద్దని పోలీసులు చెప్పినా చాలా మంది మందు బాబులు లెక్క చేయలేదు. హైటెక్ సిటీ వద్ద ఇలాంటి కేసే ఒకటి పోలీసులకు తగిలింది. ఒక యువకుడు బాగా మందు కొట్టి నడిరోడ్డుపై హల్‌చల్‌ చేశాడు. ప్రధాన రహదారిపై అడ్డంగా పడుకుని అటుఇటు పొర్లుతూ కాసేపు అందరి దృష్టిని ఆకర్షించాడు. మత్తు మరీ ఎక్కువైపోవడంతో […]

హైటెక్ సిటీ నాదే... న్యూఇయర్‌ కిక్‌లో రోడ్డుపై పొర్లిన యువకుడు
X

న్యూఇయర్ సందర్భంగా కొందరు మందుబాబులు రెచ్చిపోయారు. ఈ ప్రపంచమే తమదన్నట్టుగా తాగి ఊగిపోయారు. కొందరు మందుబాబులు పోలీసులకూ చుక్కలు చూపించారు. తాగి డ్రైవ్ చేయవద్దని పోలీసులు చెప్పినా చాలా మంది మందు బాబులు లెక్క చేయలేదు.

హైటెక్ సిటీ వద్ద ఇలాంటి కేసే ఒకటి పోలీసులకు తగిలింది. ఒక యువకుడు బాగా మందు కొట్టి నడిరోడ్డుపై హల్‌చల్‌ చేశాడు. ప్రధాన రహదారిపై అడ్డంగా పడుకుని అటుఇటు పొర్లుతూ కాసేపు అందరి దృష్టిని ఆకర్షించాడు.

మత్తు మరీ ఎక్కువైపోవడంతో హైటెక్ సిటీ నాదే అంటూ చిత్ర విచిత్రంగా ప్రవర్తించారు. రోడ్డు మీద అడ్డంగా పడుకున్న యువకుడిని… చివరకు పోలీసులు నచ్చజెప్పి, బతిమలాడుకుని పక్కకు పంపించారు.

అటు మాదాపూర్‌ సిద్ధివినాయక నగర్‌లోని క్రికెట్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన న్యూఇయర్ వేడుకలో గొడవ జరిగింది. నిర్వాహకులు సరిగా మద్యం అందజేయడం లేదంటూ, డీజే సరిగా లేదంటూ అక్కడికి వచ్చిన యువకుడు స్టేజ్‌ను ధ్వంసం చేశారు.

మద్యం సీసాలు స్టేజ్‌ మీదకు విసిరి నిప్పుపెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వచ్చి మంటలను ఆర్పివేశారు. లాఠీ చార్జ్ చేసి యువకులను చెదరగొట్టారు.

First Published:  1 Jan 2019 1:05 AM GMT
Next Story