Telugu Global
NEWS

యాదాద్రిలో ఉబికి వస్తున్న జలం....

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే నూతన ఆలయ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా యాదాద్రి ఆధునీకరణ పనులు చేపట్టారు. అద్భుతమైన శిల్ప సంపదతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ పనుల సందర్భంగా చిన్న చిన్న వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. తాజాగా కొండపై ఉన్న పుష్కరణి అభివృద్ధిలో భాగంగా సిమెంట్‌, కాంక్రీట్‌తో కింది భాగాన్ని ఫ్లోరింగ్‌ చేస్తున్నారు. ఇదే వివాదానికి కారణమవుతోంది. ఇప్పటి వరకు పుష్కరణిలో సహజసిద్ధంగా […]

యాదాద్రిలో ఉబికి వస్తున్న జలం....
X

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే నూతన ఆలయ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా యాదాద్రి ఆధునీకరణ పనులు చేపట్టారు.

అద్భుతమైన శిల్ప సంపదతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ పనుల సందర్భంగా చిన్న చిన్న వివాదాలు కూడా తలెత్తుతున్నాయి. తాజాగా కొండపై ఉన్న పుష్కరణి అభివృద్ధిలో భాగంగా సిమెంట్‌, కాంక్రీట్‌తో కింది భాగాన్ని ఫ్లోరింగ్‌ చేస్తున్నారు. ఇదే వివాదానికి కారణమవుతోంది.

ఇప్పటి వరకు పుష్కరణిలో సహజసిద్ధంగా జలాలు వచ్చేవి. గతంలో ఒకసారి మరమ్మత్తులో భాగంగా ఊట వచ్చేందుకు వీలుగా చిన్నచిన్న రంద్రాలు వదిలేసి మిగిలిన భాగాన్ని సిమెంట్‌లో కప్పేశారు. ఇప్పుడు ఏకంగా మొత్తం సిమెంట్, కాంక్రీట్‌తో కప్పేస్తున్నారు. పుష్కరిణిలో సహజసిద్ధంగా జలం ఏమీ ఉబికి రావడం లేదంటూ జియాలజిస్టులు ఇచ్చిన నివేదిక ఆధారంగా కాంక్రీట్‌ పనులు చేపట్టారు.

అలా పనులు చేసేందుకు తవ్వకాలు జరుపుతున్న సమయంలో హఠాత్తుగా సహజసిద్ధంగా జలం ఉబికి వచ్చింది. ఎంత తోడుతున్నా నీరు వస్తూనే ఉంది. దీంతో అధికారులు ఆలోచనలో పడ్డారు. ఈ విషయం తెలుసుకుని భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి సహజంగా జలం ఉబికి రావడాన్ని పరిశీలిస్తున్నారు.

సాక్షాత్తు స్వామివారి ప్రతీకగా బ్రహ్మ కమండలం నుండి జారిపడిన పవిత్ర జలంతో ఆవిర్భవించిన పుష్కరణిగా భక్తులు చెబుతున్నారు. కానీ అధికారులు మాత్రం జియాలజిస్టులు రిపోర్టు ఇచ్చారంటూ పుష్కరిణిని కాంక్రీట్‌తో కప్పేసి కృత్తిమంగా పుష్కరిణి ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించడం సరైనది కాదంటున్నారు. ఆలయ సహజత్వాన్ని దెబ్బతీసి ఇలాంటి పనులు చేయడం సరైన పద్దతి కాదంటున్నారు.

సహజంగా ఊట ఏమీ లేదంటూ జియాలజిస్టులు ఇచ్చిన నివేదిక ఆధారంగానే తాము పనులు మొదలుపెట్టామని కానీ హఠాత్తుగా ఊట ఉబికి వస్తుండడంతో ఏం చేయాలో తమకూ అర్ధం కావడం లేదంటున్నారు అధికారులు. ఈ అంశంపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని… ఆలయ ప్రతిష్టను, సహజత్వాన్ని పరిరక్షిస్తామని హామీ ఇస్తున్నారు.

First Published:  31 Dec 2018 10:15 PM GMT
Next Story