Telugu Global
NEWS

చీఫ్ జస్టిస్ లుగా రాధాకృష్ణన్, ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులు నేటి నుంచి వేరువేరుగా సేవలందిచబోతున్నాయి. తెలంగాణ తొలి చీఫ్ జస్టిస్ గా సోమవారం ఉదయం జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. విజయవాడ కేంద్రంగా ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఈరోజు ఏర్పడింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం […]

చీఫ్ జస్టిస్ లుగా రాధాకృష్ణన్, ప్రవీణ్ కుమార్ ప్రమాణ స్వీకారం
X

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులు నేటి నుంచి వేరువేరుగా సేవలందిచబోతున్నాయి. తెలంగాణ తొలి చీఫ్ జస్టిస్ గా సోమవారం ఉదయం జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి న్యాయమూర్తులు, న్యాయవాదులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

విజయవాడ కేంద్రంగా ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఈరోజు ఏర్పడింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం పూర్తికాగానే గవర్నర్ నరసింహన్ ఏపీకి ప్రత్యేక హెలీకాప్టర్ లో బయలు దేరారు. ఈరోజు ఉదయం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ప్రమాణం చేశారు.

విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ ప్రవీణ్ కుమార్ తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు. సంక్రాంతి సెలవుల దృష్ట్యా ఈ నెల 17 తరువాత పూర్తిస్థాయిలో కోర్టు సేవలు మొదలవుతాయి.

First Published:  1 Jan 2019 12:50 AM GMT
Next Story