భారత క్రీడారంగం దశదిశను నిర్ణయించే 2019
కొత్త సంవత్సరంలో క్రీడారంగం సరికొత్త లక్ష్యాలు కంగారూగడ్డపై నవచరిత్రకు టీమిండియా తహతహ నిలకడ కోసం భారత హాకీ తపన టోక్యో ఒలింపిక్స్ వైపు సానియా చూపు ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా మేరీ కోమ్ బ్యాడ్మింటన్లో సింధు, సైనా బంగారు కలలు కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకోడం…లక్ష్యాలసాధన దిశగా శ్రమించడంలో క్రీడారంగం సైతం…మిగిలిన రంగాల కంటే ఓ అడుగు ముందే ఉంటుంది. ఇండియన్ స్పోర్ట్స్ సూపర్ స్టార్లు… విరాట్ కొహ్లీ, సింధు, సైనా, సానియా మీర్జా వ్యక్తిగతంగాను… జట్లుగా […]
- కొత్త సంవత్సరంలో క్రీడారంగం సరికొత్త లక్ష్యాలు
- కంగారూగడ్డపై నవచరిత్రకు టీమిండియా తహతహ
- నిలకడ కోసం భారత హాకీ తపన
- టోక్యో ఒలింపిక్స్ వైపు సానియా చూపు
- ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా మేరీ కోమ్
- బ్యాడ్మింటన్లో సింధు, సైనా బంగారు కలలు
కొత్త సంవత్సరంలో సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకోడం…లక్ష్యాలసాధన దిశగా శ్రమించడంలో క్రీడారంగం సైతం…మిగిలిన రంగాల కంటే ఓ అడుగు ముందే ఉంటుంది.
ఇండియన్ స్పోర్ట్స్ సూపర్ స్టార్లు… విరాట్ కొహ్లీ, సింధు, సైనా, సానియా మీర్జా వ్యక్తిగతంగాను… జట్లుగా టీమిండియా , హాకీ ఇండియా సైతం నూతన సంవత్సర లక్ష్యాలతో కార్యోన్ముఖులయ్యారు.
2018 అలా…2019 ఎలా?
కాలం …నిరంతరాయంగా…అవిశ్రాంతంగా తిరిగే ఓ రంగుల రాట్నం. అది ఎవరి కోసం…ఏ ఒక్కరి కోసం ఆగదు. తరాలు మారినా, దశాబ్దాలు, శతాబ్దాలు మారినా… కాలంతో పాటు మనిషి సైతం సాగిపోక తప్పదు.
భారత క్రీడారంగానికి, క్రీడా ప్రముఖులకు గత ఏడాది కాలంగా ఎన్నో గొప్ప విజయాలు, మధుర జ్ఞాపకాలు, చేదు అనుభవాలు మిగిల్చిన 2018 సంవత్సరం.. .వీడ్కోలు తీసుకొని మరీ…కాలగర్భంలో కలసిపోయింది. అంతేకాదు… పాతసంవత్సరం పోకతోనే… కొత్త సంవత్సరం రాక జరిగిపోయింది.
సరికొత్త లక్ష్యాలతో….
గత ఏడాదికాలంలో సాధించిన విజయాలు, ఎదుర్కొన్న పరాజయాలను సమీక్షించుకొన్న భారత జట్లతో పాటు…వివిధ క్రీడలకు చెందిన ప్రముఖ క్రీడాకారులు సైతం…సరికొత్త ప్రణాళికలు, లక్ష్యాలను నిర్దేశించుకొని…2019 కోసం సిద్ధమయ్యారు.
కొహ్లీ టార్గెట్ ప్రపంచకప్….
2018 క్రికెట్ సీజన్లో…కింగ్ ఆఫ్ క్రికెట్ గా నిలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ….వరుసగా నాలుగో ఏడాది సైతం …ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ప్లేయర్ గా నిలవాలన్న పట్టుదలతో ఉన్నాడు.
క్రికెట్ మూడు ఫార్మాట్లతో పాటు…2019 ప్రపంచకప్ లో అత్యుత్తమంగా రాణించడం, టీమిండియాను మరోసారి విశ్వవిజేతగా నిలపడం… మరింత నిలకడగా రాణించడం లక్ష్యాలుగా నిర్దేశించుకొన్నాడు.
కంగారూ గడ్డపై సరికొత్త చరిత్రకు….
ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గాలన్న గత ఏడుదశాబ్దాల చిరకాల స్వప్నం సైతం…సాకారమయ్యే పరిస్థితి టీమిండియాకు కనిపిస్తోంది. నాలుగు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా… ఇటీవలే ముగిసిన మెల్బోర్న్ కమ్ బాక్సింగ్ డే టెస్టులో 137 పరుగులతో నెగ్గడం తోనే విరాట్ సేన 2-1తో పైచేయి సాధించింది.
జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరిగే నిర్ణయాత్మక ఆఖరిటెస్టులో సైతం నెగ్గి.. సరికొత్త చరిత్ర సృష్టించాలని టీమిండియా కలలు కంటోంది.
హాకీ మరింత చలాకీగా….
మరో వైపు…గత ఏడాది కాలంలో మిశ్రమఫలితాలు ఎదుర్కొన్న ప్రపంచ 5వ ర్యాంకర్ భారత హాకీ జట్టు…సరికొత్త సంవత్సరంలో మరింత నిలకడగా రాణించాలన్నదే ప్రధాన లక్ష్యంగా ఎంచుకొంది. టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సాధించాలన్నకసితో …ప్రణాళికలను సిద్ధం చేసుకొంది.
సానియా టార్గెట్ టోక్యో బెర్త్….
మాతృత్వం కోసం గత ఏడాదికాలంగా ఆటకు దూరంగా ఉన్న టెన్నిస్ స్టార్ సానియా మీర్జా….అమ్మ హోదాలో , సరికొత్త లక్ష్యాలతో సాధన చేస్తోంది. టోక్యో ఒలింపిక్స్ బెర్త్ సాధించడమే లక్ష్యమని ఇప్పటికే ప్రకటించింది.
ఎవర్ గ్రీన్ మేరీ కోమ్….
మహిళా బాక్సింగ్ ఎవర్ గ్రీన్ స్టార్, ఆరుసార్లు ప్రపంచ విజేత మేరీ కోమ్ సైతం…తన పతకాల వేటను కొనసాగించడమే లక్ష్యంగా…ముగ్గురు బిడ్డల ఈ అమ్మ కసరత్తులు చేస్తోంది.
ప్రతిభకు వయసుతో ఏమాత్రం పనిలేదని…అలుపు సొలుపు లేనే లేదని తన అసాధారణ విజయాలతో మేరీ గోల్డ్ చెప్పకనే చెబుతోంది.
గోల్డెన్ రన్ కోసం…..
భారత బ్యాడ్మింటన్ కు గత ఏడాదికాలంలో…ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన తెలుగుతేజం పీవీ సింధు, శ్రీమతి సైనా నెహ్వాల్….కొత్త సంవత్సరంలో మరింత ఉన్నత లక్ష్యాలతో సిద్ధమవుతున్నారు. ప్రపంచ, ఆల్ ఇంగ్లండ్, ఆసియా బ్యాడ్మింటన్ టోర్నీల్లో బంగారు పతకాలు సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు.
భారత క్రీడాకారుల సంకల్పం, నూతన సంవత్సర లక్ష్యాలు నెరవేరాలని కోరుకొంటూ…. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్… హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్.