Telugu Global
NEWS

పాత ఏటీఎం కార్డులకు నేడే ఆఖరి రోజు

పాత ఏటీఎం కార్డులకు నేటితో కాలం తీరిపోనుంది. రేపటి నుంచి చిప్‌ లేని ఏటీఎం కార్డులు పనిచేయవు. పాత వాటి స్థానంలో చిప్‌ ఉన్న కొత్త ఏటీఎం కార్డులను జారీ చేయనున్నారు. కొత్త ఏటీఎం కార్డుల కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయకపోయినా పాత వాటి స్థానంలో కొత్త చిప్ ఏటీఎం కార్డులను జారీ చేయనున్నాయి బ్యాంకులు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది. ఎలాంటి దరఖాస్తు అవసరం లేదని… అటోమేటిక్‌గా ఏటీఎం డెబిట్, క్రెడిట్‌ కార్డులు పోస్ట్‌ ద్వారా […]

పాత ఏటీఎం కార్డులకు నేడే ఆఖరి రోజు
X

పాత ఏటీఎం కార్డులకు నేటితో కాలం తీరిపోనుంది. రేపటి నుంచి చిప్‌ లేని ఏటీఎం కార్డులు పనిచేయవు. పాత వాటి స్థానంలో చిప్‌ ఉన్న కొత్త ఏటీఎం కార్డులను జారీ చేయనున్నారు.

కొత్త ఏటీఎం కార్డుల కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయకపోయినా పాత వాటి స్థానంలో కొత్త చిప్ ఏటీఎం కార్డులను జారీ చేయనున్నాయి బ్యాంకులు. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలైంది. ఎలాంటి దరఖాస్తు అవసరం లేదని… అటోమేటిక్‌గా ఏటీఎం డెబిట్, క్రెడిట్‌ కార్డులు పోస్ట్‌ ద్వారా ఖాతాదారులకు అందజేయనున్నారు.

గతంలో జారీ చేసిన పలు మాగ్నటిక్ పూత కలిగిన ఏటీఎం కార్డులతో ఆన్‌లైన్‌ మోసాలు జరుగుతున్న నేపథ్యంలో వాటి స్థానంలో కొత్త ఏటీఎం కార్డులను వినియోగదారులకు అందజేయనున్నారు.

2016 వరకూ బ్యాంకులు చిప్ లేని డెబిట్‌ కార్డులను ఖాతాదారులకు అందజేస్తూ వచ్చాయి. చిప్‌ ఉన్న ఏటీఎం కార్డుల వల్ల హ్యాకింగ్ భయం లేకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఆర్‌బీఐ వెల్లడించింది.

First Published:  30 Dec 2018 10:21 PM GMT
Next Story