Telugu Global
International

బంగ్లాదేశ్‌లో హసీనా కూటమి భారీ విజయం

బంగ్లాదేశ్ పార్లమెంట్‌ ఎన్నికల్లో అధికార కూటమి మరోసారి ఘన విజయం సాధించింది. ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ విజయం సాధించింది. దీంతో నాలుగో సారి హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా పగ్గాలు చేపడుతున్నారు. ఆదివారం భారీ హింస మధ్య ఎన్నికలు జరిగాయి. 17 మంది చనిపోయారు. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ మొదలైంది. 300 స్థానాలున్న బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌లో 299 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 299 స్థానాల్లో హసీనా కూటమి అవామీ లీగ్‌ ఏకంగా 267 […]

బంగ్లాదేశ్‌లో హసీనా కూటమి భారీ విజయం
X

బంగ్లాదేశ్ పార్లమెంట్‌ ఎన్నికల్లో అధికార కూటమి మరోసారి ఘన విజయం సాధించింది. ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ విజయం సాధించింది. దీంతో నాలుగో సారి హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా పగ్గాలు చేపడుతున్నారు. ఆదివారం భారీ హింస మధ్య ఎన్నికలు జరిగాయి. 17 మంది చనిపోయారు. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ మొదలైంది.

300 స్థానాలున్న బంగ్లాదేశ్‌ పార్లమెంట్‌లో 299 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 299 స్థానాల్లో హసీనా కూటమి అవామీ లీగ్‌ ఏకంగా 267 స్థానాలు సొంతం చేసుకుంది. విపక్ష జాతీయ ఐక్యతా కూటమి కేవలం 8 స్థానాలతో సరిపెట్టుకుంది. ఎంపీగా హసీనా భారీ మెజారిటీతో గెలిచారు. ఆమెకు 2 లక్షల 29వేల 539 ఓట్లు రాగా… ప్రత్యర్థి పార్టీకి చెందిన అభ్యర్థికి కేవలం 123 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఫలితాలు ఏకపక్షంగా ఉండడంతో వాటిని అంగీకరించబోమని విపక్ష కూటమి ప్రకటించింది. అధికార కూటమి భారీగా రిగ్గింగ్‌కు పాల్పడిందని ఆరోపించింది. తటస్థ సంస్థల నేతృత్వంలో మరోసారి ఎన్నికలు నిర్వహించాలని విపక్ష కూటమి డిమాండ్ చేస్తోంది.

First Published:  31 Dec 2018 12:24 AM GMT
Next Story