Telugu Global
Cinema & Entertainment

ఎట్టకేలకు బన్నీ సినిమాపై అధికారిక ప్రకటన

 ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాత సినిమా అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయిందని కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇక ఈ విషయంలో కొత్త సంవత్సరం కానుకగా క్లారిటీ ఇచ్చారు దర్శకనిర్మాతలు. “త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ […]

ఎట్టకేలకు బన్నీ సినిమాపై అధికారిక ప్రకటన
X

‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమా తో ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తర్వాత సినిమా అధికారిక ప్రకటన ఎప్పుడు వెలువడుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయిందని కూడా పుకార్లు పుట్టుకొచ్చాయి. ఇక ఈ విషయంలో కొత్త సంవత్సరం కానుకగా క్లారిటీ ఇచ్చారు దర్శకనిర్మాతలు.

“త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మూడో సారి సినిమా చేయనున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్టు కోసం గీత ఆర్ట్స్ బ్యానర్ తో కలవడం మరింత ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అల్లు అరవింద్ గారికి మా కృతజ్ఞతలు. మీ అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు” హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ట్విట్టర్ ద్వారా అధికారిక ప్రకటనను విడుదల చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ హీరోగా వచ్చిన ‘జులాయి’ మరియు ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు.

First Published:  31 Dec 2018 5:59 AM GMT
Next Story