Telugu Global
Cinema & Entertainment

సుజీత్ సినిమా కథని ఓకే చేసిన బన్నీ?

తెలుగు ఇండస్ట్రీ లోకి షార్ట్ ఫిలిం డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి శర్వానంద్ ని హీరోగా పెట్టి “రన్ రాజా రన్” అనే సినిమా తీసాడు సుజీత్. ఆ సినిమా హిట్ తరువాత ప్రభాస్ సుజీత్ ని పిలిచి సినిమా అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం సుజీత్, ప్రభాస్ ని డైరెక్ట్ చేస్తూ “సాహో” సినిమాతో బిజీగా ఉన్నాడు. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. […]

సుజీత్ సినిమా కథని ఓకే చేసిన బన్నీ?
X

తెలుగు ఇండస్ట్రీ లోకి షార్ట్ ఫిలిం డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి శర్వానంద్ ని హీరోగా పెట్టి “రన్ రాజా రన్” అనే సినిమా తీసాడు సుజీత్. ఆ సినిమా హిట్ తరువాత ప్రభాస్ సుజీత్ ని పిలిచి సినిమా అవకాశం ఇచ్చాడు. ప్రస్తుతం సుజీత్, ప్రభాస్ ని డైరెక్ట్ చేస్తూ “సాహో” సినిమాతో బిజీగా ఉన్నాడు. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.

ఇక సుజీత్ ఇటీవలే “సాహో” సినిమా షెడ్యూల్ బ్రేక్ లో వెళ్ళి అల్లు అర్జున్ కి కథ చెప్పాడట. సుజీత్ చెప్పిన కథ నచ్చిన అల్లు అర్జున్ వెంటనే మైత్రి మూవీ మేకర్స్ తో సుజీత్ కి చెక్ ఇప్పించాడట. ఈ సినిమాని త్వరలో మైత్రి మూవీ మేకర్స్ వారు అనౌన్స్ చెయ్యబోతున్నారు. “సాహో” సినిమా రిలీజ్ తరువాత ఈ సినిమాని మొదలుపెట్టాలని డైరెక్టర్ సుజిత్ నిర్ణయించుకున్నాడు అంట. ఇదిలా ఉంటే “సాహో” సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ 15 న గ్రాండ్ గా తెలుగు, తమిళ, హిందీ బాషల్లో రూపొందుతుంది.

First Published:  30 Dec 2018 10:18 PM GMT
Next Story