Telugu Global
Cinema & Entertainment

నయనతార సినిమాకి త్రివిక్రమ్ కథ?

నయనతార సెకండ్ ఇన్నింగ్స్ లో హిట్స్ మీద హిట్స్ కొడుతూ దూసుకుపోతుంది. ఇప్పటికే తమిళ్ లో వరుస సినిమాలు ఒప్పుకున్న ఈ భామ తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి సరసన “సై రా” సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం మేరకు నయనతార ఇప్పుడు తెలుగు లో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించాబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. తెలుగు లో స్టార్ ప్రొడక్షన్ హౌస్ గా పేరు తెచ్చుకున్న హారిక హాసిని క్రియేషన్స్ వాళ్ళు […]

నయనతార సినిమాకి త్రివిక్రమ్ కథ?
X

నయనతార సెకండ్ ఇన్నింగ్స్ లో హిట్స్ మీద హిట్స్ కొడుతూ దూసుకుపోతుంది. ఇప్పటికే తమిళ్ లో వరుస సినిమాలు ఒప్పుకున్న ఈ భామ తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి సరసన “సై రా” సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజా సమాచారం మేరకు నయనతార ఇప్పుడు తెలుగు లో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించాబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. తెలుగు లో స్టార్ ప్రొడక్షన్ హౌస్ గా పేరు తెచ్చుకున్న హారిక హాసిని క్రియేషన్స్ వాళ్ళు దీన్నీ ప్రొడ్యూస్ చేస్తున్నారు అని సమాచారం.హారిక హాసిని వాళ్ళు ఈ సినిమాని కథని త్రివిక్రమ్ రాయాల్సింది గా కోరారు అంట.

త్రివిక్రమ్ కి హారిక హాసిని వాళ్ళతో ఎలాగో మంచి అనుభందం ఉంది కాబట్టి కథ,కథనాలు రాయడానికి ఒప్పుకున్నాడు అంట. ఇక త్రివిక్రమ్ ప్రస్తుతం నయనతార కి సంభందించిన ఒక మంచి లైన్ ని వెతికే పనిలో ఉన్నాడు అని తెలుస్తుంది. అసలు కెరీర్ లో ఒక్క సారి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ నయనతారతో కలిసి పని చెయ్యలేదు. ఈ సినిమా ద్వారా తోలి సారి నయనతారతో కలిసి పని చెయ్యబోతున్నాడు త్రివిక్రమ్.

First Published:  30 Dec 2018 12:39 AM GMT
Next Story