Telugu Global
Health & Life Style

జామ, పుదీనాతో.... మృదువైన చర్మం మీ సొంతం!

ఆధునిక కాలంలో చర్మ సౌందర్యానికి అష్టకష్టాలు పడుతున్నారు. చిన్న, పెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ అందం, చర్మ సౌందర్యంపై ప్ర‌త్యేకంగా దృష్టి సారిస్తున్నారు. అయితే చర్మ సంరక్షణ కోసం పలు రకాల పదార్థాలను వాడుతున్నారు. వాటిలో సహాజ సిద్ధమైనవి చాలా తక్కువగా ఉంటున్నాయి. క్రీములు, పౌడర్లు వాడితేనే చర్మం సౌందర్యవంతంగా ఉంటుందని భ్రమపడుతుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రీములు, పౌడర్లు బెడిసి కొడుతుంటాయి. దీంతో చర్మం దెబ్బతినే సందర్భాలు ఉంటాయి. క్రీములు, పౌడర్లు […]

జామ, పుదీనాతో.... మృదువైన చర్మం మీ సొంతం!
X

ఆధునిక కాలంలో చర్మ సౌందర్యానికి అష్టకష్టాలు పడుతున్నారు. చిన్న, పెద్ద, ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతిఒక్కరూ అందం, చర్మ సౌందర్యంపై ప్ర‌త్యేకంగా దృష్టి సారిస్తున్నారు.

అయితే చర్మ సంరక్షణ కోసం పలు రకాల పదార్థాలను వాడుతున్నారు. వాటిలో సహాజ సిద్ధమైనవి చాలా తక్కువగా ఉంటున్నాయి. క్రీములు, పౌడర్లు వాడితేనే చర్మం సౌందర్యవంతంగా ఉంటుందని భ్రమపడుతుంటారు.

కానీ కొన్ని సందర్భాల్లో క్రీములు, పౌడర్లు బెడిసి కొడుతుంటాయి. దీంతో చర్మం దెబ్బతినే సందర్భాలు ఉంటాయి. క్రీములు, పౌడర్లు పక్కనపెట్టి….సహాజ సిద్దమైన పద్దతులు పాటిస్తే….అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.

1.పుదీన :

పుదీనా ఆకులను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దానిలోకి గుడ్డులోని తెల్లసొన వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. 40 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.

దీంతో పాటుగా… పుదీనా రసంలో పొప్పడి రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గోరువెచ్చని నీటితో కడిగిన ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నిమిషాల తరువాత నీటితో కడుకోవాలి. ఇలా తరచూ చేస్తే చర్మం మీద ముడుతలు పోతాయి.

2. జామపండు:

జామపండుపై ఉన్న తొక్క తీసి మెత్తని గుజ్జులా చేసుకోవాలి. ఈ పేస్టును ముఖానికి రాయాలి. 15 నిమిషాల తరువాత దూదితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.

జామపండు గుజ్జు, పెరుగును సమమోతాదులో తీసుకుని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకోవాలి. 15 నిమిషాల తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే చర్మం పొడి బారకుండా ఉంటుంది.

దీంతోపాటుగా… జామపండుని రెండు ముక్కలుగా కోయాలి. అందులోని గింజలని తీసి మెత్తని గుజ్జులా చేయాలి. దీనికి జామ ఆకులను కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే చర్మంపై జిడ్డు పోతుంది.

First Published:  29 Dec 2018 7:02 PM GMT
Next Story