Telugu Global
Cinema & Entertainment

బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ మాజీ భార్య

పవన్ కల్యాణ్ కు అధికారికంగా దూరమైన తర్వాత పూర్తిగా పూణెకు పరిమితమయ్యారు రేణుదేశాయ్. టాలీవుడ్ వైపు మళ్లీ కన్నెత్తి చూడలేదు. ఈ గ్యాప్ లో కొన్ని సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ, పిల్లల కోసం అన్నీ పక్కనపెట్టేశారు. మళ్లీ ఇన్నేళ్లకు ఇటువైపు చూశారు రేణుదేశాయ్. త్వరలోనే ఆమె ఓ షాపింగ్ మాల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించనున్నారు. కళామందిర్ కు చెందిన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు రేణుదేశాయ్. ఈ మేరకు […]

బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ మాజీ భార్య
X
పవన్ కల్యాణ్ కు అధికారికంగా దూరమైన తర్వాత పూర్తిగా పూణెకు పరిమితమయ్యారు రేణుదేశాయ్. టాలీవుడ్ వైపు మళ్లీ కన్నెత్తి చూడలేదు. ఈ గ్యాప్ లో కొన్ని సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ, పిల్లల కోసం అన్నీ పక్కనపెట్టేశారు. మళ్లీ ఇన్నేళ్లకు ఇటువైపు చూశారు రేణుదేశాయ్. త్వరలోనే ఆమె ఓ షాపింగ్ మాల్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కనిపించనున్నారు.
కళామందిర్ కు చెందిన కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నారు రేణుదేశాయ్. ఈ మేరకు రేణుపై ఓ ఫొటోషూట్ కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఓ మంచి రోజు చూసి ఆ స్టిల్స్ ను రిలీజ్ చేయబోతున్నారు. అదే రోజు హోర్డింగ్స్, పేపర్ యాడ్స్ కూడా ఇవ్వబోతున్నారు.
ఈ ఎండోర్స్ మెంట్ క్లిక్ అయితే రేణుదేశాయ్ కు కొత్త అవకాశాలు తలుపుతట్టడం ఖాయం. ప్రస్తుతం ఆమె ఓ టీవీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా కనిపించే అవకాశం ఉందంటున్నారు చాలామంది. అంతేకాదు, ఆమె త్వరలోనే రెండో వివాహం కూడా చేసుకోబోతున్నారు.
First Published:  29 Dec 2018 8:34 PM GMT
Next Story