Telugu Global
Cinema & Entertainment

ఈ హీరోను ఆదుకునేది ఎవరు?

మొన్నటదాకా నితిన్ ప్ర సేఫ్ గా సాగింది. ఎప్పుడైతే లై సినిమా దెబ్బకొట్టిందో అప్పట్నుంచి ఈ హీరోకు కష్టాలు మొదలయ్యాయి. రీసెంట్ గా వచ్చిన శ్రీనివాస కల్యాణం కూడా ఫ్లాప్ అవ్వడంతో నితిన్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడీ హీరో ఇద్దరు దర్శకులపై ఆశలు పెట్టుకున్నాడు. త్వరలోనే వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు నితిన్. దీనికి భీష్మ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఛలోతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ కుడుముల తనకు కూడా […]

ఈ హీరోను ఆదుకునేది ఎవరు?
X
మొన్నటదాకా నితిన్ ప్ర సేఫ్ గా సాగింది. ఎప్పుడైతే లై సినిమా దెబ్బకొట్టిందో అప్పట్నుంచి ఈ హీరోకు కష్టాలు మొదలయ్యాయి. రీసెంట్ గా వచ్చిన శ్రీనివాస కల్యాణం కూడా ఫ్లాప్ అవ్వడంతో నితిన్ కష్టాలు రెట్టింపు అయ్యాయి. ఇప్పుడీ హీరో ఇద్దరు దర్శకులపై ఆశలు పెట్టుకున్నాడు.
త్వరలోనే వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ మూవీ చేయబోతున్నాడు నితిన్. దీనికి భీష్మ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఛలోతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ కుడుముల తనకు కూడా హిట్ ఇస్తాడని నితిన్ ఆశగా ఎదురుచూస్తున్నాడు. మరోవైపు చంద్రశేఖర్ యేలేటిని కూడా లైన్లో పెట్టాడు
సూపర్ హిట్ రేంజ్ సినిమాలు ఇవ్వకపోయినా, ఓ మోస్తరు సినిమాలు ఇవ్వగలడు యేలేటి. పైగా ఇతడి సినిమాలు కొత్తగా ఉంటాయి. అందుకే ఈ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మరి ఈ ఇద్దరు దర్శకుల్లో నితిన్ కు ఎవరు హిట్ ఇస్తారో చూడాలి. వెంకీ కుడుముల సినిమాలో హీరోయిన్ గా రష్మికను తీసుకున్న నితిన్, చంద్రశేఖర్ యేలేటి కోసం రకుల్ ను సంప్రదిస్తున్నాడు.
First Published:  29 Dec 2018 8:16 PM GMT
Next Story