Telugu Global
Cinema & Entertainment

భారీ మొత్తానికి అమ్ముడు పోయిన "కే.జి.ఎఫ్" డిజిటల్ రైట్స్

కన్నడ సినిమా అయిన “కే.జి.ఎఫ్” రిలీజ్ అయిన అన్ని బాషల్లో మొదటి రోజు నుంచే హిట్ టాక్ ని తెచ్చుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. రాకింగ్ స్టార్ యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చాప్టర్ 1 గా రిలీజ్ అయ్యింది. అంటే చాప్టర్ 2 త్వరలో రానుందన్నమాట. ఊర మాస్ హీరోగా యాష్ అద్భుతమైన నటన మరియు ప్రతి సీన్  క్లైమాక్స్ ని తలపించేలా మలచిన ప్రశాంత్ నీల్ […]

భారీ మొత్తానికి అమ్ముడు పోయిన కే.జి.ఎఫ్ డిజిటల్ రైట్స్
X

కన్నడ సినిమా అయిన “కే.జి.ఎఫ్” రిలీజ్ అయిన అన్ని బాషల్లో మొదటి రోజు నుంచే హిట్ టాక్ ని తెచ్చుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది.

రాకింగ్ స్టార్ యాష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా చాప్టర్ 1 గా రిలీజ్ అయ్యింది. అంటే చాప్టర్ 2 త్వరలో రానుందన్నమాట.

ఊర మాస్ హీరోగా యాష్ అద్భుతమైన నటన మరియు ప్రతి సీన్ క్లైమాక్స్ ని తలపించేలా మలచిన ప్రశాంత్ నీల్ దర్శకత్వం ప్రేక్షకులను బాగా మెప్పించింది. అటు థియేటర్లలోనే కాక ఇటు సినిమా రైట్స్ ద్వారా కూడా రికార్డుల మోత మోగిస్తోంది ఈ సినిమా.

“కే జి ఎఫ్” సినిమా డిజిటల్ రైట్స్ ను తాజాగా అమెజాన్ ప్రైమ్ అక్షరాలా 18 కోట్ల రూపాయలు చెల్లించి కొనుక్కుంది. ఇప్పటిదాకా డిజిటల్ రైట్స్ ద్వారా ఇంత పెద్ద మొత్తాన్ని సాధించిన ఒకే ఒక్క కన్నడ సినిమా గా “కే.జి.ఎఫ్” నిలిచింది. మళ్ళీ ఈ రికార్డ్ ని ఏ సినిమా ఇప్పట్లో అందుకోలేదు అని కన్నడ ఇండస్ట్రీ టాక్.

ఈ సినిమా రిలీజ్ అయిన ప్రతి చోట డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రాఫిట్స్ ని తెచ్చిపెడుతుంది. మరి కే.జి.ఎఫ్ చాప్టర్ 1 ఈ రేంజ్ లో ఉంటే…. చాప్టర్ 2 ఏ రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

First Published:  29 Dec 2018 1:25 AM GMT
Next Story