Telugu Global
Cinema & Entertainment

త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి సినిమా

తెలుగు సినిమా పరిశ్రమలో ఏ దర్శకుడికి మెగా స్టార్ చిరంజీవిని డైరెక్ట్ చెయ్యాలని ఉండదు? కానీ ఆ అదృష్టం అందరికి దక్కదు చాలా తక్కువ మందికి దక్కుతుంది. ఇప్పుడు ఆ లిస్టు లో త్రివిక్రమ్ వచ్చి చేరాడు. అవును స్టార్ రైటర్, స్టార్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలో మెగా స్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ విషయాన్నీ స్వయానా చిరంజీవే చెప్పాడు. ఇటీవలే “వినయ విధేయ రామ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ […]

త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరంజీవి సినిమా
X

తెలుగు సినిమా పరిశ్రమలో ఏ దర్శకుడికి మెగా స్టార్ చిరంజీవిని డైరెక్ట్ చెయ్యాలని ఉండదు? కానీ ఆ అదృష్టం అందరికి దక్కదు చాలా తక్కువ మందికి దక్కుతుంది. ఇప్పుడు ఆ లిస్టు లో త్రివిక్రమ్ వచ్చి చేరాడు. అవును స్టార్ రైటర్, స్టార్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ త్వరలో మెగా స్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ విషయాన్నీ స్వయానా చిరంజీవే చెప్పాడు.

ఇటీవలే “వినయ విధేయ రామ” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన ఇచ్చాడు. చిరంజీవి మాట్లాడుతూ “అతి త్వరలో నేను త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో నటించబోతున్నాను అని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. “ఆర్.ఆర్.ఆర్” “వినయ విధేయ రామ” వంటి భారీ బడ్జెట్ సినేమ్లని ప్రొడ్యూస్ చేస్తూ ప్రొడ్యూసర్ గా మంచి పేరు తెచ్చుకున్న డి.వి.వి దానయ్య ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు. కేవలం రామ్ చరణ్ వల్లే ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యింది” అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి. ప్రస్తుతం “సై రా” సినిమాతో బిజీగా ఉన్న చిరంజీవి ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేస్తాడు చిరంజీవి. మరో పక్క త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.

First Published:  27 Dec 2018 10:40 PM GMT
Next Story