Telugu Global
NEWS

నంద్యాల ఎంపీ సీటుపై ఆయ‌న గురి? మ‌రీ ఏ పార్టీలో చేరుతారో?

నంద్యాల రాజ‌కీయం మారుతోంది. ఎన్నిక‌ల వేళ కొత్త ముఖాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథి రెడ్డి పాలిటిక్స్ రీ ఎంట్రీ కోసం ట్ర‌య‌ల్స్ వేస్తున్నారు. నంద్యాల ఎంపీగా పోటీ చేసేందుకు పావులు క‌దుపుతున్నారు. ఈ మ‌ధ్య‌నే ఓ పెళ్లికి హాజ‌రయ్యేందుకు వ‌చ్చిన బిజ్జం పార్థ‌సార‌థి రెడ్డి నంద్యాల ఎంపీగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసేది క్లారిటీ ఇస్తాన‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా బిజ్జం పేరుతో భారీ కార్ల […]

నంద్యాల ఎంపీ సీటుపై ఆయ‌న గురి? మ‌రీ ఏ పార్టీలో చేరుతారో?
X

నంద్యాల రాజ‌కీయం మారుతోంది. ఎన్నిక‌ల వేళ కొత్త ముఖాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథి రెడ్డి పాలిటిక్స్ రీ ఎంట్రీ కోసం ట్ర‌య‌ల్స్ వేస్తున్నారు. నంద్యాల ఎంపీగా పోటీ చేసేందుకు పావులు క‌దుపుతున్నారు.

ఈ మ‌ధ్య‌నే ఓ పెళ్లికి హాజ‌రయ్యేందుకు వ‌చ్చిన బిజ్జం పార్థ‌సార‌థి రెడ్డి నంద్యాల ఎంపీగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ఏ పార్టీ నుంచి పోటీ చేసేది క్లారిటీ ఇస్తాన‌ని చెప్పారు. ఈ సంద‌ర్భంగా బిజ్జం పేరుతో భారీ కార్ల ర్యాలీని అనుచ‌రులు నిర్వ‌హించారు.

బిజ్జం పొలిటిక‌ల్ రీ ఎంట్రీతో నంద్యాలే కాదు. పాణ్యం రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. 2004 నుంచి బిజ్జం రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. 1999లో పాణ్యం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆత‌ర్వాత 2004లో ఇక్క‌డి నుంచి కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి గెలిచారు.

కాట‌సాని, బిజ్జం కుటుంబాల మ‌ధ్య ఫ్యాక్ష‌న్ త‌గ‌దాలు ఉన్నాయి. అయితే అప్ప‌టి సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి రెండు కుటుంబాల మ‌ధ్య రాజీ కుదిర్చారు. దీంతో అప్ప‌టి నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న బిజ్జం వ్యాపారాల‌కు ప‌రిమిత‌మ‌య్యారు. వ‌చ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న ఏ పార్టీ నుంచి పోటీ చేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఎంపీగా గెలిచిన ఎస్పీవైరెడ్డి టీడీపీలో చేరారు. ఆయ‌న అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. త‌న అల్లుడు లేదా కుమార్తెకు ఎంపీ టికెట్ కోరుతున్నారు.

ఇటు వైసీపీ నుంచి ఎవ‌రు పోటీ చేస్తార‌నేది ఇంకా తేల‌లేదు. దీంతో ఇప్పుడు బిజ్జం టీడీపీ నుంచి బ‌రిలో ఉంటార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల పెళ్లికి హాజ‌రైనప్పుడు బిజ్జం వేసిన పోస్ట‌ర్లు ప‌సుపు రంగులో ఉండ‌డంతో ఆయ‌న టీడీపీ నుంచి పోటీ చేస్తార‌ని ఊహ‌గానాలు వినిపిస్తున్నాయి.

First Published:  28 Dec 2018 12:28 AM GMT
Next Story