Telugu Global
Cinema & Entertainment

సుకుమార్ కథకి నో చెప్పిన మహేష్ బాబు ?

“భరత్ అనే నేను” సినిమా హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా “మహర్షి”. మహేష్ బాబు 25 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. వంశీ పైడిపల్లి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు సుకుమార్ దర్శకత్వంలో చేసిన “వన్ నేనొక్కడినే” సినిమా ఫ్లాప్ అయింది. అయినప్పటికీ […]

సుకుమార్ కథకి నో చెప్పిన మహేష్ బాబు ?
X

“భరత్ అనే నేను” సినిమా హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా “మహర్షి”. మహేష్ బాబు 25 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. వంశీ పైడిపల్లి ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

ఇంతకుముందు సుకుమార్ దర్శకత్వంలో చేసిన “వన్ నేనొక్కడినే” సినిమా ఫ్లాప్ అయింది. అయినప్పటికీ సుకుమార్ దర్శకత్వం వహించిన “రంగస్థలం” సూపర్ హిట్ అవ్వడంతో మహేష్ మళ్ళీ సుక్కు కి ఛాన్స్ ఇచ్చాడు. ఇక మహేష్ బాబు కోసం ఒక పీరియాడిక్ స్క్రిప్ట్ ని రెడీ చేసాడట సుకుమార్.ఇటివలే మహేష్ ని కలిసి ఈ కథ చెప్పాడు సుకుమార్. మహేష్ బాబు మొదట బానే ఉంది అనుకున్నా పీరియడ్ డ్రామా అంటే రిస్క్ తో కూడుకున్న పని కాబట్టి, మహేష్ ఆ స్క్రిప్ట్ కు నో చెప్పాడట. ప్రస్తుతం సుకుమార్ మహేష్ కోసం ఒక థ్రిల్లర్ స్క్రిప్ట్ ను సిద్ధం చేయబోతున్నాడని టాక్. మైత్రి మూవీ మేకర్స్ వారే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు.

First Published:  27 Dec 2018 8:47 PM GMT
Next Story