Telugu Global
Cinema & Entertainment

భారతీయుడు-2 షెడ్యూల్ ఖరారు

భారతీయుడు సీక్వెల్ కు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఈ మూవీ కోసం ముచ్చటగా మూడు షెడ్యూల్స్ ఫిక్స్ చేశారు. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సీక్వెల్ మొదటి షెడ్యూల్ చెన్నైలో ఉంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి చెన్నై శివార్లలో ఓ భారీ సెట్ నిర్మిస్తున్నారు. జనవరి నుంచి ఆ సెట్ లో ఫస్ట్ షెడ్యూల్ మొదలవుతుంది. ఇక రెండో షెడ్యూల్ ను పొల్లాచ్చిలో ప్లాన్ చేశారు. ఇది దాదాపు 20 రోజుల పాటు […]

భారతీయుడు-2 షెడ్యూల్ ఖరారు
X
భారతీయుడు సీక్వెల్ కు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఈ మూవీ కోసం ముచ్చటగా మూడు షెడ్యూల్స్ ఫిక్స్ చేశారు. కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సీక్వెల్ మొదటి షెడ్యూల్ చెన్నైలో ఉంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి చెన్నై శివార్లలో ఓ భారీ సెట్ నిర్మిస్తున్నారు. జనవరి నుంచి ఆ సెట్ లో ఫస్ట్ షెడ్యూల్ మొదలవుతుంది.
ఇక రెండో షెడ్యూల్ ను పొల్లాచ్చిలో ప్లాన్ చేశారు. ఇది దాదాపు 20 రోజుల పాటు జరిగే షెడ్యూల్. పొలాచ్చి తర్వాత యూనిట్ అంతా ఉక్రెయిన్ వెళ్లబోతోంది. ఆ దేశంలోనే సినిమాకు సంబంధించిన మేటర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నారు. ఇలా రికార్డు టైమ్ లో భారతీయుడు-2 షూటింగ్ ను పూర్తిచేయబోతున్నారు.
షెడ్యూల్స్ అయితే బాగానే వేసుకున్నారు కానీ శంకర్ తో ఇదంతా సాధ్యమా అనేది డౌట్. ఎందుకంటే ఏ సినిమా తీసినా దాదాపు ఏడాది తీస్తాడు శంకర్. చివరికి త్రీ-ఇడియట్స్ రీమేక్ ను కూడా ఏడాది తీశాడు. అలాంటి దర్శకుడితో 5-6 నెలల్లో సినిమా చేయడం అంటే రికార్డు అనే చెప్పాలి. 2020 సంక్రాంతికి భారతీయుడు-2ను థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుంది.
First Published:  27 Dec 2018 9:00 PM GMT
Next Story