Telugu Global
Cinema & Entertainment

సమంతా కొడుకు పాత్రలో రావు రమేష్

అక్కినేని సమంతా ఈ ఏడాది సినిమాల మీద సినిమాలు చేసి వరుస హిట్స్ ని అందుకొని స్టార్ గా మరో మెట్టు ఎక్కింది. ఇక ఈ భామ వచ్చే ఏడాది కూడా వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరించనుంది. ఇప్పటికే నాగ చైతన్య తో కలిసి నటిస్తున్న “మజిలి” సినిమా షూట్ ని పూర్తీచేసి మరో సినిమా షూట్ కి డేట్స్ కేటాయించింది సమంతా. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరబాద్ లో […]

సమంతా కొడుకు పాత్రలో రావు రమేష్
X

అక్కినేని సమంతా ఈ ఏడాది సినిమాల మీద సినిమాలు చేసి వరుస హిట్స్ ని అందుకొని స్టార్ గా మరో మెట్టు ఎక్కింది. ఇక ఈ భామ వచ్చే ఏడాది కూడా వరుస సినిమాలతో ప్రేక్షకులని అలరించనుంది. ఇప్పటికే నాగ చైతన్య తో కలిసి నటిస్తున్న “మజిలి” సినిమా షూట్ ని పూర్తీచేసి మరో సినిమా షూట్ కి డేట్స్ కేటాయించింది సమంతా. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరబాద్ లో జరుగుతుంది. కొరియన్ సినిమా “మిస్ గ్రానీ” కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కి తెలుగు లో “ఓ బేబీ ఎంత సక్కగున్నవే” అనే టైటిల్ ని ఖరారు చేసారు టీం.

అయితే ఈ సినిమాలో అక్కినేని సమంతా కి కొడుగ్గా రావు రమేష్ నటిస్తున్నాడు. కథ పరంగా ఈ సినిమాలో సమంతా డెబ్బై ఏళ్ళ ముసలమ్మ పాత్రలో నటిస్తుంది, ఇక ఆమె కొడుగ్గా రావు రమేష్ నటిస్తున్నాడు. ఈ డెబ్బై ఏళ్ళ ముసలమ్మ శరీరం ఒక 24 ఏళ్ళ యువతి లోకి ప్రవేశిస్తే ఎం అవుతుంది అనేది సినిమా కథ. నాగ శౌర్య ఈ సినిమాలో సమంతా కి బాయ్ ఫ్రెండ్ గా నటిస్తున్నాడు. సురేష్ బాబు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి లక్ష్మి భూపాల మాటలు రాస్తున్నాడు.

First Published:  27 Dec 2018 4:07 AM GMT
Next Story