Telugu Global
NEWS

జగన్‌ది కేసుల భయం.... పవన్‌ది తెలిసీ తెలియని తనం

ఏపీ ప్రతిపక్ష నాయకులపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీవ్రంగా స్పందించారు. జగన్‌ను విమర్శించారు. జగన్‌, పవన్‌లు మోడీకి వంతపాడుతున్నారని ఆరోపించారు. కేసుల భయంతో జగన్, తెలిసీ తెలియని తనంతో పవన్‌ కల్యాణ్‌లు… మోడీతో అంటగాగుతున్నారని స్పీకర్ విమర్శించారు. ఐదు కోట్ల ప్రజల కోసం చంద్రబాబు తన ఆత్మగౌరవాన్ని కూడా చంపుకుని మోడీ వద్ద చేతుల కట్టుకుని నిలబడ్డారని అయినా సరే ఫలితం లేకపోయిందన్నారు. కేవలం రాజధాని పునాదికి కాస్త మట్టి, కుండ నీళ్లు ఇచ్చి మోడీ అవమానించారని  […]

జగన్‌ది కేసుల భయం.... పవన్‌ది తెలిసీ తెలియని తనం
X

ఏపీ ప్రతిపక్ష నాయకులపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీవ్రంగా స్పందించారు. జగన్‌ను విమర్శించారు. జగన్‌, పవన్‌లు మోడీకి వంతపాడుతున్నారని ఆరోపించారు. కేసుల భయంతో జగన్, తెలిసీ తెలియని తనంతో పవన్‌ కల్యాణ్‌లు… మోడీతో అంటగాగుతున్నారని స్పీకర్ విమర్శించారు.

ఐదు కోట్ల ప్రజల కోసం చంద్రబాబు తన ఆత్మగౌరవాన్ని కూడా చంపుకుని మోడీ వద్ద చేతుల కట్టుకుని నిలబడ్డారని అయినా సరే ఫలితం లేకపోయిందన్నారు. కేవలం రాజధాని పునాదికి కాస్త మట్టి, కుండ నీళ్లు ఇచ్చి మోడీ అవమానించారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా కేవలం చంద్రబాబుపై బురద జల్లేందుకే మోడీ గుంటూరు వస్తున్నారని కోడెల వ్యాఖ్యానించారు.

గుంటూరు వస్తున్న ప్రధాని మోడీని అడ్డుకుంటామని మంత్రి నక్కా ఆనంద్‌బాబు ప్రకటించారు. మోడీని ఏపీలో అడుగుపెట్టనివ్వబోమన్నారు. మోడీ సభకు జగన్‌ తెర వెనుక సాయం చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.

First Published:  26 Dec 2018 11:08 PM GMT
Next Story