Telugu Global
NEWS

ఎమ్మెల్యే ఆర్కేపై టీడీపీ అభ్యర్థి ఈమె!

మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం రాత్రి ఆమె అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరాల్సిందిగా చంద్రబాబు ఆహ్వానించారు. అందుకు ఆమె సుముఖత వ్యక్తం చేశారు. మంచి రోజు చూసుకుని పార్టీలో చేరాల్సిందిగా చంద్రబాబు సూచించారు. కాండ్రు కమల తన వియ్యంకుడు, టీడీపీ నేత, మాజీ మంత్రి మురుగుడు హనుమంత రావు, అల్లుడు, భర్తతో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు. 2009లో మంగళగిరి […]

ఎమ్మెల్యే ఆర్కేపై టీడీపీ అభ్యర్థి ఈమె!
X

మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మంగళవారం రాత్రి ఆమె అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో చేరాల్సిందిగా చంద్రబాబు ఆహ్వానించారు.

అందుకు ఆమె సుముఖత వ్యక్తం చేశారు. మంచి రోజు చూసుకుని పార్టీలో చేరాల్సిందిగా చంద్రబాబు సూచించారు. కాండ్రు కమల తన వియ్యంకుడు, టీడీపీ నేత, మాజీ మంత్రి మురుగుడు హనుమంత రావు, అల్లుడు, భర్తతో కలిసి చంద్రబాబుతో భేటీ అయ్యారు.

కాండ్రు కమల

2009లో మంగళగిరి నుంచి కాండ్రు కమల ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ కుదేలయ్యే సరికి రాజకీయాలకు కొన్నేళ్లుగా దూరంగా ఉంటున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో కాండ్రు కమల రాజకీయాల్లో తిరిగి చురుకైన పాత్ర పోషించేందుకు సిద్దమవుతున్నారు.

ఈమె వైసీపీలో చేరుతారని తొలుత ప్రచారం జరిగింది. ఆమె కూడా వైసీపీలో చేరడానికి అన్ని ప్రయత్నాలూ చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎమ్మెల్యే ఆర్కే స్థానంలో ఈమెకు టికెట్ ఇస్తారన్న ప్రచారం జరిగింది. కానీ తన పనితీరుతో ప్రజల్లో మంచి ఆదరణ సంపాదించుకున్న ఎమ్మెల్యే ఆర్కేను టచ్ చేసే సాహనం వైసీపీ చేయలేకపోయింది. దీంతో కాండ్రు కమల టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

చాలా కాలంగా మంగళగిరిలో సరైన అభ్యర్థి కోసం చంద్రబాబు ఆన్వేషిస్తున్నారు. ఇప్పుడు కాండ్రు కమల రావడంతో ఆమెకు మంగళగిరి టీడీపీ టికెట్ దాదాపు ఖాయమంటున్నారు.

First Published:  26 Dec 2018 10:55 PM GMT
Next Story