Telugu Global
Cinema & Entertainment

బుల్లితెరపై అరవింద సమేత హంగామా

థియేటర్లలో హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆ సినిమా మాత్రం తక్కువ గ్యాప్ లోనే బుల్లితెరపై ప్రత్యక్షం అవుతుంది. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇలా టీవీల్లో ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి అరవింద సమేత కూడా చేరబోతోంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జీ తెలుగులో త్వరలోనే ప్రసారం కాబోతోంది. అయితే అంతకంటే ముందే జీ తెలుగు సంస్థకు చెందిన జీ5 అనే యాప్ లో ఈ సినిమాను అప్ […]

బుల్లితెరపై అరవింద సమేత హంగామా
X

థియేటర్లలో హిట్ అయినా, ఫ్లాప్ అయినా ఆ సినిమా మాత్రం తక్కువ గ్యాప్ లోనే బుల్లితెరపై ప్రత్యక్షం అవుతుంది. ఇప్పటికే ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇలా టీవీల్లో ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి అరవింద సమేత కూడా చేరబోతోంది. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జీ తెలుగులో త్వరలోనే ప్రసారం కాబోతోంది.

అయితే అంతకంటే ముందే జీ తెలుగు సంస్థకు చెందిన జీ5 అనే యాప్ లో ఈ సినిమాను అప్ లోడ్ చేశారు. స్టార్ మా కు హాట్ స్టార్, జెమినీ టీవీకి సన్ నెక్ట్స్ ఎలాగో.. జీ తెలుగు ఛానెల్ కు జీ5 అనే యాప్ అలా అన్నమాట. ఇప్పుడా యాప్ లోనే అరవింద సమేత అప్ లోడ్ అయింది.

గతంలో ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమా విడుదలైన 50 రోజులకే టీవీల్లో వచ్చేసింది. 50 రోజులైనప్పటికీ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అయింది. అలాంటి టైమ్ లో టీవీల్లో అప్పుడే ప్రసారం చేయడం ఏంటంటూ అప్పట్లో అభిమానులు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు అరవింద సమేత చిత్రానికి ఆ సమస్య లేదు. ఎందుకంటే ఇది జనతా గ్యారేజ్ రేంజ్ హిట్ కాదు. పైగా విడుదలై చాలా రోజులైంది కూడా.

First Published:  25 Dec 2018 7:02 PM GMT
Next Story